3వేలు దాటిన కరోనా మరణాలు

కరోనా ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా మరణించినవారి సంఖ్య 3వేలు దాటింది.

admin1
Published on: 2 March 2020 10:28 PM IST
3వేలు దాటిన కరోనా మరణాలు
X

కరోనా ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా మరణించినవారి సంఖ్య 3వేలు దాటింది. చైనాలో తాజాగా మరో 42 మందిని ఈ వైరస్ బలి తీసుకుంది. దీంతో ఒక్క చైనాలోనే మృతుల సంఖ్య 2వేల 912కు చేరింది. కొత్తగా మరో 202 మందికి వైరస్ సోకడంతో బాధితుల సంఖ్య 89వేలకు చేరువైంది. వైరస్‌ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా తగ్గుతోందని అధికారులు తెలిపారు.

60 సంవత్సరాలు పైబడి.. ఆరోగ్యం బలహీనంగా వారిపైనే కరోనా వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. చాలా మందిలో లక్షణాల తీవ్రత స్వల్ప స్థాయిలోనే ఉంటున్నాయని.. అందుకే వెంటనే గుర్తించడం కాస్త కష్టంగా మారిందని WHO వెల్లడించింది. ఇక కొవిడ్‌ సోకినవారిలో మరణాల రేటు 2-5శాతంగా ఉందని తెలిపింది. అదే గతంలో వచ్చిన సార్స్‌, మెర్స్‌లో ఇది వరుసగా 9.5శాతం, 34.5శాతంగా ఉందని తెలిపింది.

admin1

admin1

Next Story