Chandrayaan 2: లాండర్ విక్రం క్షేమంగా జాబిలిపై దిగిందోచ్!

Chandrayaan 2: లాండర్ విక్రం క్షేమంగా జాబిలిపై దిగిందోచ్!
x
Highlights

మొన్న కమ్యూనికేషన్ కోల్పోయి ఆందోళన రేకెత్తించింది. నిన్న చూచాయగా కనిపించి దొరికింది అనిపించింది. ఈరోజు ఏ మాత్రం చెక్కు చెదరకుండా ఉన్నట్లు తెలిసింది. ఇదీ లాండర్ విక్రం విషయంలో ఇస్రో పురోగతి.

చంద్రుని రహస్యాలను శోధించడం కోసం మన ఇస్రో చేసిన సంక్లిష్ట ప్రయోగంలో చివరి నిమిషంలో లాండర్ విక్రం తడబాటుకు గురై సమాచార వ్యవస్థను కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో విక్రం పరిస్థితి పై అందరూ ఆందోళన చెందారు. శనివారం జాబిలిపై దిగే క్రమంలో విక్రం తో సంబంధాలు తెగిపోయాయి. అయితే, ఇస్రో శాస్త్రవేత్తలు విక్రం క్షేమంగా చంద్రునిపై దిగే ఉంటుందని బలంగా నమ్మరు. వారి నమ్మకం వమ్ము కాలేదు. ఆదివారం విక్రం జాడల్ని ఆర్బిటార్ కనిపెట్టి ఇస్రోకు సమాచారం చేరవేసింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ, విక్రం క్షేమంగా ల్యాండ్ అయిందా లేక క్రాష్ అయి ముక్కలు అయిపోయి ఉంటుందా అనేది అందరిలోనూ అనుమానంగా మిగిలింది. దానికి ఈరోజు ఇస్రో శాస్త్రవేత్తలు శుభవార్త చెప్పారు. విక్రమ్‌ పరిస్థితి యథాతథంగా ఉందని సోమవారం ఇస్రో అధికారులు ప్రకటించారు.

దీనిపై అధికారులు మాట్లాడుతూ... 'నిర్దేశిత లక్ష్యానికి అతి దగ్గరగా ల్యాండర్‌ హార్డ్‌ ల్యాండ్‌ అయింది. ఆర్బిటర్‌ పంపిన థర్మల్‌ ఛాయాచిత్రాల ద్వారా అది గమనించాం. ల్యాండర్‌ సింగిల్‌ పీన్‌గానే ఉంది. ముక్కలు కాలేదు. దానితో కమ్యునికేషన్స్‌ ఏర్పరుచుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం' అని తెలిపారు.

ఈ వార్తా ఇటు ఇస్రో శాస్త్రవేత్తలకే కాకుండా యావత్ భారతావనికీ శుభవార్తగానే చెప్పాలి. ఇప్పుడు ఇస్రో విక్రంతో కమ్యూనికేషన్ ఏర్పర్చుకుంటే.. అందరిలోనూ ఆనందం మరింత పెరుగుతుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories