Happy Birthday PT Usha: 56వ వసంతంలోకి అడుగుపెట్టిన 'పరుగుల రాణి' పీటీ ఉష.. శుభాకాంక్షలు వెల్లువ

Samba Siva Rao
Published on: 27 Jun 2020 7:15 PM IST
Happy Birthday PT Usha: 56వ వసంతంలోకి అడుగుపెట్టిన పరుగుల రాణి పీటీ ఉష.. శుభాకాంక్షలు వెల్లువ
X

భారత మాజీ అథ్లెట్, దిగ్గజ ఒలింపియన్‌ 'పరుగుల రాణి' 'పయోలి ఎక్స్‌ప్రెస్'‌ పీటీ ఉష 56వ వసంతంలోకి అడుగుపెట్టారు. కేరళ రాష్ట్రంలోని కోజికోడ్‌ జిల్లా పయోలీలో జూన్‌ 27, 1964లో జన్మించారు. 1979లో పీటీ ఉష జాతీయ స్థాయి పాఠశాల క్రీడలలో పాల్గొన్నారు. ఆమెలోని నైపుణ్యాన్ని కోచ్ నంబియార్ పసిగట్టాడు. అప్పటి నుంచి చాలా కాలం అతడే కోచ్‌గా శిక్షణ ఇచ్చాడు. 1980 రష్యా ఒలింపిక్స్ లో పాల్గొన్నా ఉషకూ అంతగా కలిసిరాలేదు. ఉష అంతర్జాతీయ క్రీడా జీవితంలో మొత్తం మీద 101 స్వర్ణ పతకాలను సాదించారు. అర్జున అవార్డు, పద్మశ్రీ బిరుదు, పలు ఉత్తమ అథ్లెట్‌ అవార్డులను ఆమె సాధించారు. భారతదేశం తరఫున పీటీ ఉష 1979 నుంచి అథ్లెటిక్స్‌లో పాల్గొని దేశానికి అద్భుత విజయాలను అందించారు. 1986 సియోల్‌ ఆసియా క్రీడల్లో 4 బంగారు పతకాలు, ఒక రజత పతకం సాధించారు. 1982 ఢిల్లీ ఆసియా క్రీడల్లో కూడా 2 రజత పతకాలు కైవసం చేసుకున్నారు.

1990 ఆసియాడ్‌లో 3 రజిత, 1994 ఆసియాడ్‌లో ఒక రజిత పతకం సాధించారు. 1984 లాస్‌ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో 400 మీటర్ల హార్డిల్స్ పరుగు పందెంలో సెకనులో వందోవంతుతో కాంస్య పతకం లభించే అవకాశాన్ని చేజార్చుకున్నారు. పుట్టినరోజు సందర్భంగా పీటీ ఉషకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు క్రీడా, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. భారత క్రికెట్ జట్టు మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ ట్విట్టర్ ద్వారా పీటీ ఉషకు విషెస్ చెప్పారు. ఇండియన్ ట్రాక్‌ అండ్‌ పరుగుల రాణి పీటీ ఉష గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ అద్భుతమైన విజయాలను చూస్తూ పెరిగాను. భారతీయులుగా మాకు చాలా గర్వకారణం. యువతను ప్రోత్సహించడానికి మీరు అంకితభావంతో స్ఫూర్తిని ఇస్తూనే ఉన్నారు. మీరు ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండాలి అని యూవీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా స్పందించారు..అంతేకాదు పీటీ ఉషతో ఉన్న ఫొటోలను పోస్టుకు షేర్ చేశారు. లెజెండ్‌, భారతదేశ అసలైన గోల్డెన్‌ గర్ల్‌ పీటీ ఉషకు జన్మదిన శుభాకాంక్షలు. అని ట్వీట్ చేశారు.





Samba Siva Rao

Samba Siva Rao

Next Story