Congress: కాంగ్రెస్ పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ

Congress: టీఎంసీ తీర్థం పుచ్చుకున్న కీర్తి ఆజాద్

Sandeep Eggoju
Published on: 23 Nov 2021 9:04 PM IST
Bihar Congress Party Leader Kirti Azad Joined in TMC Party
X

తృణమూల్ కాంగ్రెస్ లో చేరిన బీహార్ కాంగ్రెస్ నేత కీర్తి ఆజాద్ 

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. బీహార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ క్రికెటర్ కీర్తీ ఆజాద్ టీఎంసీలో చేరారు. సాయంత్రం మమతా బెనర్జీ ఆద్వర్యంలో కీర్తి ఆజాద్ టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు. కీర్తి ఆజాద్ చేరికతో టీఎంసీ పార్టీ మొట్టమొదటిసారిగా బీహార్‌లో అడుగుపెట్టనుంది. 2024 ఎన్నికల కోసం మమతా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో టీఎంసీని విస్తరిస్తున్నారు. ఇదిలా ఉంటే రేపు ప్రధాని మోడీతో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ భేటీ కానున్నారు. మోడీతో భేటీలో బెంగాల్‌లో బీఎస్ఎఫ్ అధికార పరిధిని 15 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్లకు పెంచిన అంశంతో పాటు త్రిపురలో హింస, బెంగాల్ అభివృద్ధికి సంబంధించిన అంశాలను చర్చించనున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story