ఆర్టికల్ 370 రద్దు: జాతీయ భద్రతను కేంద్రం సంక్షోభంలోకి నెట్టేసింది..రాహుల్ గాంధీ

ఆర్టికల్ 370 రద్దు: జాతీయ భద్రతను కేంద్రం సంక్షోభంలోకి నెట్టేసింది..రాహుల్ గాంధీ
x
Highlights

నిన్న జమ్మూ కశ్మీర్ స్వయం ప్రతిపత్తికి సంబంధించిన ఆర్టికల్ 370 ని రద్దు చేస్తూ కేంద్రం రాజ్యసభలో బిల్లు పాస్ చేసింది. ఈరోజు ఈ బిల్లుపై లోక్ సభలో వాడీ...

నిన్న జమ్మూ కశ్మీర్ స్వయం ప్రతిపత్తికి సంబంధించిన ఆర్టికల్ 370 ని రద్దు చేస్తూ కేంద్రం రాజ్యసభలో బిల్లు పాస్ చేసింది. ఈరోజు ఈ బిల్లుపై లోక్ సభలో వాడీ వేడీ చర్చ జరుగుతోంది. ఒక పక్క లోక్ సభలో ఈ బిల్లుపై చర్చ జరుగుతుండగా, మరోపక్క కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

కేంద్ర ప్రభుత్వం తన అధికార దుర్వినియోగంతో జాతీయ భద్రతను సంక్షోభంలోకి నేట్టేసిందని మండిపడ్డారు. ప్రజా ప్రతినిధులను నిర్బంధించి, ఇతర పక్షాల అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాన్ని తీసుకున్నారన్నారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘనే అని వ్యాఖ్యానించారు. భారత దేశం భూములతో నిర్మితం కాలేదని, ప్రజలతో ఏర్పడిందని..ఈ రకంగా ఏకపక్ష నిర్ణయం తీసుకుని జమ్మూ కశ్మీర్‌ను ఏడిపించడం జాతీయ సమగ్రత అనిపించుకోదు అని ఉద్వేగపూరిత ట్వీట్‌ చేశారు.

అయితే, రాజ్యసభలో ఈ బిల్లును నెగ్గించుకున్న కేంద్రానికి లోక్ సభలో గెలిపించుకోవడానికి పెద్ద కష్టం కాదు. లోక్ సభలో ఎన్డీయే కూటమికి 353 మంది సభ్యులున్నారు.

"National integration isn't furthered by unilaterally tearing apart J&K, imprisoning elected representatives and violating our Constitution. This nation is made by its people, not plots of land.

This abuse of executive power has grave implications for our national security."




Show Full Article
Print Article
More On
Next Story
More Stories