Anand Mahindra tweet on Indian village life: అసలైన సంతోషం అంటే ఇదే కదా!

Anand Mahindra tweet on Indian village life: ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు.. సమకాలీన అంశాల పైన ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటారు

Krishna
Published on: 6 July 2020 10:09 PM IST
Anand Mahindra tweet on Indian village life: అసలైన సంతోషం అంటే ఇదే కదా!
X
Anand Mahindra on Indian village life (Image from Anand Mahindra tweet)

Anand Mahindra tweet on Indian village life: ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు.. సమకాలీన అంశాల పైన ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటారు అయన... తాజాగా ఓ వీడియోని షేర్ చేస్తూ నిజమైన సంతోషం అంటే ఇదే కదా అంటూ పోస్ట్ పెట్టారు ఆనంద్ మహీంద్రా. ఆ వీడియోలో ఓ గ్రామంలో కొంతమంది చిన్నారులు చెరువు దగ్గర ఆడుకుంటున్నారు. అయితే వారు చాలా దూరం నుంచి పరిగెత్తుకుంటూ వస్తూ మట్టిలో జారుకుంటూ నీటిలో పడిపోతున్నారు.

22 సెకన్ల వ్యవధిలో ఉన్న ఈ వీడియో ఆనంద్ మహీంద్రాని ఎంతో ఆకర్షించింది. ఈ వీడియోని అయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. " సంతోషం అంటే ఇదే, ఇలాంటి సంతోషాన్ని భారతీయ గ్రామాలు మాత్రమే మనకి ఇవ్వగలవు.. వెళ్లి ఒక్కసారి చూడండి" అంటూ కామెంట్ చేశారు. అంతేకాకుండా ఈ వీడియో క‌రోనా అనంత‌రం మ‌న‌మంద‌రం ప్రతీ ఆనందానికి మనం ఎక్కువ విలువ‌నిస్తాం. ఈ వీడియో సోమ‌వారం మూడ్‌ను మార్చేస్తుంది' అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోని సుమారుగా లక్షన్నర మందికి పైగా వీక్షించారు. కొంతమంది నెటిజన్లు ఈ వీడియోపైన తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

ఆనంద్ మహీంద్రాను ట్విట్టర్‌లో దాదాపుగా 8 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. తరచూ అయన దృష్టిని ఆకర్షించే ఫన్నీ, ఆలోచనాత్మక మరియు వినోదాత్మక పోస్ట్‌లను నెటిజన్లతో పంచుకుంటారు అయన ... గత ఏడాది బురదలో గీసిన బోర్డుతో కొంతమంది పిల్లలు క్యారమ్ ఆడుతున్న ఫోటోను షేర్ చేస్తూ "స్ఫూర్తిదాయకం" అంటూ తన ఫాలోవర్లతో పంచుకున్నారు ఆనంద్ మహీంద్రా.


Krishna

Krishna

Next Story