Arshad Warsi tweet on Electricity Bill: మరో నటుడికి చుక్కలు చూపించిన కరెంట్ బిల్లు!

Arshad Warsi tweet on Electricity Bill: కరెంట్ బిల్లులు చుక్కలు చూపిస్తున్నాయి. నిజానికి వాడుకున్న కరెంట్ కి, వచ్చే బిల్లులకి అస్సలు సంబంధం లేకుండాపోతుంది.

Krishna
Published on: 6 July 2020 3:05 PM IST
Arshad Warsi tweet on Electricity Bill: మరో నటుడికి చుక్కలు చూపించిన కరెంట్ బిల్లు!
X

Arshad Warsi tweet on Electricity Bill: కరెంట్ బిల్లులు చుక్కలు చూపిస్తున్నాయి. నిజానికి వాడుకున్న కరెంట్ కి, వచ్చే బిల్లులకి అస్సలు సంబంధం లేకుండాపోతుంది.. చిన్న చిన్న గుడిసెలకు కూడా లక్షల్లో బిల్లు వస్తున్నాయి. సామాన్యులే కాదు.. సెలబ్రిటీలు కూడా ఇదే పరిస్థితిని ఎదురుకుంటున్నారు. తాజాగా నటుడు అర్షద్ వార్సీకి ఈ అనుభవం ఎదురైంది. దీనితో అర్షద్ వార్సీ విద్యుత్ బిల్లులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు రూ. లక్షకు పైగా విద్యుత్ బిల్లు వచ్చిందని, ఈ సమస్యను అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్ (ఎఈఎమ్ఎల్) సంప్రదించిన తరువాత పరిష్కరించినట్లు అర్షద్ వార్సీ స్పష్టం చేశాడు.

విద్యుత్ బిల్లులు అధికంగా వస్తున్నాయంటూ ఇప్పటికే బాలీవుడ్ తారలు ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అంతకుముందు, కార్తీక, తాప్సీ పన్నూ, హుమా ఖురేషి, సోహా అలీ ఖాన్, వీర్ దాస్, పుల్కిత్ సామ్రాట్, రేణుకా షాహనే, డినో మోరియా వంటి తారలు లాక్‌డౌన్ సమయంలో తమ పెరిగిన విద్యుత్ బిల్లులపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ లిస్టులోకి ఇప్పుడు అర్షద్ వార్సీ కూడా చేరాడు. తనకి వచ్చిన కరెంట్ బిల్లును చూస్తే తన పెయింటింగ్స్ మరియు తరువాత మూత్రపిండాలను అమ్మవలసి ఉన్నట్లు అనిపిస్తుంది అంటూ ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు.

Krishna

Krishna

Next Story