Electricity Bill shock to Karthika: కరెంట్ బిల్లు చూసి షాక్ తిన్న హీరోయిన్!

Electricity Bill shock to Karthika: కరెంట్ బిల్లు చూసి షాక్ తిన్న హీరోయిన్!
x
Highlights

Electricity Bill shock to Karthika: కరెంట్ కాదు.. ఇప్పుడు బిల్లులు అందరికి షాక్ ను ఇస్తున్నాయి.. అవును..

Electricity Bill shock to Karthika: కరెంట్ కాదు.. ఇప్పుడు బిల్లులు అందరికి షాక్ ను ఇస్తున్నాయి.. అవును.. వాడుకున్న కరెంట్ కి, వచ్చే బిల్లుకి అస్సలు సంబంధం లేకుండాపోతుంది.. తాజాగా తన ఇంటికి వచ్చిన కరెంట్ బిల్లును చూసి కంగు తింది ఓ హీరోయిన్.. ఇంతకీ ఎంటో ఆ సంగతి చూద్దాం పదండి.. !

కార్తీక నాయర్.. ఈ హీరోయిన్ అందరికీ తెలుసు.. అలనాటి హీరోయిన్ రాధ కుమార్తె.. అక్కినేని నాగచతన్య హీరోగా నటించిన జోష్ సినిమాలో హీరోయిన్ గా నటించింది.. తమిళ్ లో ఓ రెండు సినిమాలు చేసింది.. చేసినవి తక్కువ సినిమాలే అయిన మంచి గుర్తింపు అయితే తెచ్చుకుంది.. ప్రస్తుతం సినిమాల్లో కనిపించకపోయిన సోషల్ మీడియాలో మాత్రం బాగానే ఆక్టివ్ గా ఉంటుంది..

తాజాగా తనకి ఎదురైన ఓ అనుభవాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది ఈమె.. ముంబైలో ఉంటున్న తన నివాసానికి అదానీ ఎలక్ట్రిసిటీ సరఫరా ఉంది. అయితే కరోనా వలన గత రెండు నెలలుగా బిల్లు తీయ్యలేదు.. కానీ ఆ రెండు నెలల బిల్లును కలిపి ఒకేసారి పంపించారు.. ఆ రెండు నెలల బిల్లు ఏకంగా లక్ష రూపాయల రావడంతో ఒక్కసారిగా షాక్ కి గురైంది కార్తీక..

ఇది నా హోటల్ బిల్లు కంటే ఎక్కువగా ఉంది. నా ఇంటికి కరెంట్ బిల్లు అంతగా ఎలా వచ్చింది అంటూ ఆమె సోషల్ మీడియాలో అదానీ గ్రూప్ ను ప్రశ్నించింది.. మినిమం కరెంట్ వాడకున్నా ఇంత బిల్లు ఎలా వచ్చిందో చెప్పాలి అంటూ ఎలక్ట్రిసిటీ అధికారిక ఖాతాను ట్యాగ్ చేసింది.


Show Full Article
Print Article
Next Story
More Stories