ఎన్టీఆర్ ఫాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన ట్రైనర్

ఎన్టీఆర్ ఫాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన ట్రైనర్
x
Lloyd Stevens, NTR (File Photo)
Highlights

ఎన్టీఆర్ పుట్టినరోజు సంబరాలు అప్పుడే మొదలయ్యాయి. ఇప్పటికే ఫ్యాన్స్ ట్విట్టర్ లో హాల్ చల్ చేస్తున్నారు. ఇక రాజమౌళి దర్శకత్వంలో

ఎన్టీఆర్ పుట్టినరోజు సంబరాలు అప్పుడే మొదలయ్యాయి. ఇప్పటికే ఫ్యాన్స్ ట్విట్టర్ లో హాల్ చల్ చేస్తున్నారు. ఇక రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న RRR మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ లేకపోవడం మాత్రం ఫాన్స్ ని నిరాశపరిచింది. లాక్ డౌన్ వలన పనులన్నీ అపేశామని, దీనివల్ల ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సప్ రైజ్ చేయడానికి ఎలాంటి ప్లాన్ చేయలేదని ట్విట్టర్ వేదికగా RRR టీం వెల్లడించింది.

అంతేకాకుండా ఎన్టీఆర్ కూడా RRR చిత్రం నుండి ఈ సందర్భంగా ఎటువంటి ఫస్ట్‌ లుక్‌ లేదా టీజర్‌ విడుదల కావటంలేదు అనే విషయం మిమ్మల్ని తీవ్ర నిరాశ కు గురిచేసిందని నేను అర్ధం చేసుకోగలను. ఫస్ట్‌ లుక్‌ లేదా టీజర్‌ మీ ఆనందం కోసం సిద్ధం చేయాలని చిత్ర బృందం ఎంతగా కష్టపడింది అనేది నాకు తెలుసు అంటూ పేర్కొన్నారు.

ఈ నేపధ్యంలో ఎన్టీఆర్ ఫాన్స్ కి బూస్ట్ ఇచ్చే ప్రకటన చేశాడు ఆయనెవరో కాదు ఎన్టీఆర్ పర్సనల్ ఫిజికల్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ .. జింబాబ్వేకి చెందిన స్టీవెన్ తారక్ కి ఎప్పటి నుండో ఫిజికల్ ట్రైనర్ గా ఉంటున్నాడు. ''రేపు ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా తారక్ అభిమానుల కోసం నేనొక స్పెషల్ సర్ప్రైజ్ ను ఈరోజు సిద్ధం చేస్తున్నాను. వేచి చూడండి'' అంటూ ట్వీట్ చేశాడు. ఇంతకి ఆ స్పెషల్ సర్ప్రైజ్ ఏంటి అని ఫాన్స్ ఎదురుచూస్తున్నారు.

ఇక రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తున్నాడు. ఇందులో రామ్ చరణ్ మరో హీరోగా నటిస్తున్నాడు. ఇందులో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. కరోనా ప్రభావంతో సినిమా షూటింగ్ వాయిదా పడింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories