Indian Journalist: న్యూయార్క్‌లో భారత జర్నలిస్టు మృతి..

America New York Unfortunately Indian Journalists Fazil Khan Died In Fire Accident
x

Indian Journalist: న్యూయార్క్‌లో భారత జర్నలిస్టు మృతి..

Highlights

Indian Journalist: తన ఫ్లాట్‌లోనే ఊపిరాడక మృతి చెందిన ఫాజిల్ ఖాన్

Indian Journalist: అమెరికాలో జరిగిన అగ్ని ప్రమాదంలో భారత్‌కు చెందిన ఓ జర్నలిస్టు ప్రాణాలు కోల్పోయాడు. న్యూయార్క్‌ నగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో చోటు చేసుకొంది. తన అపార్ట్‌మెంట్‌లోని సెల్లార్‌లో ఉన్న ఓ ఎలక్ట్రికల్‌ బైక్‌లోని లిథియం అయాన్‌ బ్యాటరీలో మంటలు చెలరేగాయి. అవి వేగంగా వ్యాపించి అపార్ట్‌మెంట్‌ను చుట్టుముట్టాయి. దట్టమైన పొగ కమ్మేయటంతో ఊపిరాడక ఫాజిల్ ఖాన్ మరణించినట్టు తెలుస్తుంది.

ఈ ఘటనలో మరో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అక్కడి మీడియా కథనాలు ప్రచురించింది. ఈ ప్రమాదంపై భారత కార్యాలయం స్పందించింది. ఫాజిల్‌ మృతి పట్ల విచారం వ్యక్తం చేసింది. మృతదేహాన్ని భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories