Air India: 20 గంటలు ఆలస్యం.. కేంద్ర మంత్రిత్వశాఖ నోటీసులు

Air India: ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లాల్సిన విమానం దాదాపు 20 గంటలు ఆలస్యంగా కారణంగా ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 31 May 2024 7:21 PM IST
Air India Gets Ministry Notice Over 20 Hour Flight Delay
X

Air India: 20 గంటలు ఆలస్యం.. కేంద్ర మంత్రిత్వశాఖ నోటీసులు

Air India: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఎయిర్ ఇండియా విమానం గంటల తరబడి ఆలస్యం కావడంపై కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లాల్సిన విమానం దాదాపు 20 గంటలు ఆలస్యంగా కారణంగా ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. గంటల తరబడి విమానంలోనే కూర్చోవాల్సి వచ్చింది. ఏసీ కూడా పని చేయలేదు. కొందరు స్పృహ తప్పి పడిపోయారు. కొన్ని కారణాల వల్ల విమానం ఆలస్యమైందని ... ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నామని ఎయిర్ ఇండియా వర్గాలు తెలిపాయి. అయితే 50డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ఢిల్లీలో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చర్యలు ఎందుకు చేపట్టలేదో వివరణ ఇవ్వాలని కేంద్ర మంత్రిత్వ శాఖ ఎయిర్ ఇండియాను వివరణ కోరింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story