Navneet Kaur Tests Positive For Covid 19: నటి, ఎంపీ నవనీత్ కౌర్ కు కరోనా పాజిటివ్..

Navneet Kaur Test Positive For Covid 19: కరోనా మహమ్మారి ప్రపంచంలో ఏ రంగాన్ని వదలకుండా పట్టిపీడిస్తోంది.

S. Srikanth
Updated on: 6 Aug 2020 9:05 PM IST
Navneet Kaur Tests Positive For Covid 19: నటి, ఎంపీ నవనీత్ కౌర్ కు కరోనా పాజిటివ్..
X
Navneet Kaur (File Photo)

Navneet Kaur Test Positive For Covid 19: కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచంలో ఏ రంగాన్ని వదలకుండా పట్టిపీడిస్తోంది. చిన్నా.. పెద్ద, ధనిక.. పేద, అన్న తేడా లేకుండా అందర్నీ వణికిస్తోంది. రాజకీయ నేతలు, సినిమా వాళ్ళు, పోలీసులు, వైద్యులు, జర్నలిస్టులు.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలానే ఉంది. ఇదిలా ఉంటె సినీ నటి, ఎంపీ నవనీత్ కౌర్ కరోనా బారిన పడ్డారు. ఇప్పటికీ ఆమె కుటుంబంలో 10 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ క్రమంలో ఆమె టెస్ట్లులు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. అయితే, ఆమెకు కరోనా లక్షణాలు ఎమీ లేకుండా పాజిటివ్ నిర్దారణ కావడం ఆశ్చర్యకరం.

ఇక నవనీత్ కౌర్ విషయానికి వస్తే 2019 సార్వత్రిక ఎన్నికల్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), కాంగ్రెస్ పార్టీ కూటమి నుండి పోటి చేసు గెలుపొందిన ఏకైక వ్యక్తి నవనీత్ కౌర్ కావడం విశేషం.. లోక్ సభలో తన వాయిస్ వినుపిస్తూ అనేక అంశాలపై మాట్లాడి ఆశ్చర్యపరిచారు.

నవనీత్ కౌర్, ఆర్పీ.పట్నాయక్ తో కలిసి నటించిన శీను వాసంతి లక్ష్మి సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. ఆ తరువాత రూమ్ మేట్స్, జగపతి, గుడ్ బాయ్, మహారధి, టెర్రర్, శత్రువు వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అంతే కాదు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన యమదొంగ సినిమాలో ఓక ప్రేత్యక గీతంలో కూడా నటించారు. ఇక పంజాబీ, మలయాళం, కన్నడం, తమిళం మరియు హిందీ భాషల్లో కూడా పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.




S. Srikanth

S. Srikanth

Next Story