Jammu And Kashmir: జమ్మూకాశ్మీర్ లోయలో వరుసగా ఉగ్రదాడులు.. అప్రమత్తమైన భద్రతా బలగాలు
Jammu And Kashmir: ప్రతి వాహనాన్ని జల్లెడ పడుతున్న జవాన్లు
Jammu And Kashmir: జమ్మూకాశ్మీర్ లోయలో వరుసగా ఉగ్రదాడులు.. అప్రమత్తమైన భద్రతా బలగాలు
Jammu And Kashmir: జమ్మూకాశ్మీర్ లోయలో ఉగ్రవాదుల వరుస దాడులతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.. దీంతో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణపై అధికారుల్లో ఆందోళన మొదలయ్యింది.. ఉగ్రవాదులను కట్టడి చేసేందుకు జమ్మూకాశ్మీర్ పూంచ్ ఏరియాలో ముందు జాగ్రత్తగా వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ప్రతి వాహనాన్ని జల్లెడ పడుతున్నారు. ఏ మాత్రం అనుమానం వచ్చినా భద్రతా బలగాలు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఓపక్క ఉగ్రవాదులు.. మరో పక్క ఆర్మీ బలగాల చర్యలతో వ్యాలీలో హైటెన్షన్ నెలకొన్నది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
Next Story


