Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు హతం

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌ అడవులు మరోసారి తూపాకి మోతలతో దద్దరిల్లాయి.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 4 Oct 2024 4:23 PM IST
7 Maoists Killed In Encounter With Security Forces In Chhattisgarh
X

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు హతం

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌ అడవులు మరోసారి తూపాకి మోతలతో దద్దరిల్లాయి. దంతెవాడ - నారాయణపూర్‌ సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు హతం అయ్యారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం ఎన్‌కౌంటర్‌ కొనసాగుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

గత కొన్ని రోజులుగా ఆపరేషన్ గ్రీన్ హంట్‌ ను ముమ్మరంగా చేస్తోంది కేంద్రం. భద్రతా బలగాలతో కూంబింగ్ నిర్వహిస్తూ.. మావోయిస్టుల నిర్మూలనే లక్ష్యంగా దూకుడుగా వెళ్లోంది. గత ఏడాది కాలంలోనే పలు ఎన్‌కౌంటర్లలో 150మందికి పైగా మావోయిస్టులు చనిపోయారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story