Coronavirus Updates: భారత్‌లో కొత్తగా 16,922 కరోనా పాజిటివ్‌ కేసులు

Arun Chilukuri
Updated on: 25 Jun 2020 10:42 AM IST
Coronavirus Updates: భారత్‌లో కొత్తగా 16,922 కరోనా పాజిటివ్‌ కేసులు
X

భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 16,922 కేసులు నమోదు కాగా, 418 మంది ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో మొత్తం 4,73,105 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,86,514 ఉండగా, 2,71,696 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 14,894 మంది కరోనా వ్యాధితో మరణించారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 2,07,871 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు. ఇప్పటి వరకు దేశంలో 75,60,782 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story