Fire Accident: మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం

* అహ్మద్‌నగర్ జిల్లా కోవిడ్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం * ఐసీయూలో చెలరేగిన మంటలు * 10మంది మృతి, మరో 11మంది పరిస్థితి విషమం

Shilpa
Published on: 6 Nov 2021 2:03 PM IST
10 Patients Killed due to Fire Accident at Covid Hospital in Maharashtra
X

మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం(ఫైల్ ఫోటో)

Fire Accident: మహరాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అహ్మద్‌నగర్ జిల్లా కోవిడ్ ఆస్పత్రిలో సంభవించిన ఈ ప్రమాదంలో 10మంది రోగులు సజీవ దహనమయ్యారు. మరో 11 మంది గాయపడ్డారు. వీరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కరోనా వార్డులోని ఐసీయూలో మంటలు చెలరేగి ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయానికి ఐసీయూలో 17 మంది రోగులు చికిత్స పొందుతున్నట్టు అధికారులు తెలిపారు.

ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స కోసం మరో ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఆస్పత్రికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను ఆర్పుతున్నారు. ఐసీయూలో షార్ట్ సర్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. ఉదయం 11గంటల ప్రాంతలో ఈ ప్రమాదం జరిగింది.

Shilpa

Shilpa

Next Story