ధోనీకి మరో అరుదైన గౌరవం!

ధోనీకి మరో అరుదైన గౌరవం!
x
Highlights

ధోనీకి మరో అరుదైన అవకాశం దక్కబోతోంది. లడఖ్ లోని లేహ్ లో ఈ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాల్లో భాగం కానున్నాడు. అక్కడ జాతీయ జెండా ఎగురవేసే గౌరవం ధోనీకి లభించినట్టు తెలుస్తోంది.

నిబద్ధతకు దొరికే గుర్తింపు ఇలాగే వుంటుంది. దేశం మీద ప్రేమ అందరికీ ఉంటుంది. ప్రాణాలను లెక్కచేయనంత అభిమానం కొందరికే ఉంటుంది. అందులో ముందు వరుసలో చెప్పుకోవలసిన పేరు మహేష్ సింగ్ ధోనీ. లక్షలాది మంది అభిమానులు.. ఇంకా ఆడగలిగే సత్తా.. దేశ జట్టును ముందుండి నడిపించే నైపుణ్యం ఇన్ని ఉన్న ధోనీ.. రెండు నెలల పాటు మన దేశ సరిహద్దుల్లో పహారా కాసే విధుల్లో పనిచేయాలని కోరుకున్నాడు. దానికి రక్షణ అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కొంత కాలంగా తీవ్ర కల్లోలం నెలకొన్న కాశ్మీర్ సరిహద్దుల్లో విధులు ప్రారంభించాడు ధోనీ. ఇవన్నీ తెలిసిన విషయాలే. తనకు గౌరవ లెఫ్టినెంట్ హోదా ఉన్నా.. దానిని పక్కన పెట్టి సాధారణ సైనికునిలా సేవలు అందిస్తున్న ధోనీ ఇప్పుడు భారత మిలటరీ దళాలకు బ్రాండ్ అంబాసిడార్.

ఇప్పుడు ధోనీకి ఆర్మీ మరో అరుదైన గౌరవాన్ని ఇవ్వబోతోందని తెలుస్తోంది. ఆగస్టు 15 భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని లద్దాక్‌లోని లేహ్‌లో నిర్వహించనున్న వేడుకల్లో జెండా ఆవిష్కరించే అవకాశం ధోనీకి దక్కిందని వినవస్తోంది. జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370 అధికరణను మోదీ సర్కార్‌ ఇటీవలే రద్దు చేసి.. జమ్ముకశ్మీర్‌, లద్దాక్‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధోనీ అక్కడ జాతీయ జెండాను ఎగరవేయనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం పుల్వామా జిల్లా క్రూ ప్రాంతంలో పారా రెజిమెంట్‌ యూనిట్‌లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న ధోనీ.. ఈ నెల 10న తన బృందంతో కలిసి లేహ్‌ వెళ్లనున్నారని తెలుస్తోంది. స్వాతంత్య్ర దినోత్సవం నాడు జమ్ముకశ్మీర్‌లోని ప్రతి గ్రామంలో భారత త్రివర్ణ పతాకం ఎగురవేయాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ధోనీ లెహ్‌లో జెండాను ఆవిష్కరించనున్నాడని తెలుస్తోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories