భీమ్లా నాయక్ హిందీ రిలీజ్ ను జాన్ అడ్డుకుంటాడా ?

Bheemla Nayak: 2020 లో విడుదలైన మలయాళం సినిమా "అయ్యప్పనుమ్ కోషీయుమ్" సినిమా పెద్ద హిట్టయిన సంగతి తెలిసిందే.

Arun Chilukuri
Published on: 19 Feb 2022 2:50 PM IST
Will John Abraham Block the Hindi Release of Bheemla Nayak?
X

భీమ్లా నాయక్ హిందీ రిలీజ్ ను జాన్ అడ్డుకుంటాడా ?

Bheemla Nayak: 2020 లో విడుదలైన మలయాళం సినిమా "అయ్యప్పనుమ్ కోషీయుమ్" సినిమా పెద్ద హిట్టయిన సంగతి తెలిసిందే. పృథ్వీరాజ్ సుకుమారన్ మరియు బిజు మీనన్ లు నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు నమోదు చేసుకుంది. ఈ సినిమా ఇప్పుడు తెలుగులో కూడా రీమేక్ కాబోతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా హీరోలుగా నటిస్తుండగా "భీమ్లా నాయక్" అనే టైటిల్ తో ఈ సినిమా తెలుగులో విడుదలకు సిద్ధమవుతోంది. సాగర్ కే చంద్ర ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాని హిందీలో కూడా రీమేక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ మధ్యనే ముంబై సాగా, సత్యమేవ జయతే 2 వంటి సినిమాలతో మంచి హిట్ ను అందుకున్న జాన్ అబ్రహం ఇప్పుడు "అయ్యప్పనుమ్ కోషీయుమ్" సినిమా హిందీ రీమేక్ రైట్స్ కొనుగోలు చేశారట. అయితే గతంలో "అల వైకుంఠపురం లో" సినిమా రీమేక్ రైట్స్ ని ఒక నిర్మాణ సంస్థ సొంతం చేసుకుంది. కానీ అప్పటికే కార్తీక్ ఆర్యన్ ఈ సినిమా హిందీ రీమేక్ మొదలు పెట్టడంతో, సినిమా హిందీలో డబ్ అవ్వలేదు. దీంతో సినిమా హిందీ డబ్బింగ్ వర్షన్ విడుదలకు నోచుకోలేదు. మరి "భీమ్లా నాయక్" సినిమా ఇంకా విడుదల కాలేదు కాబట్టి హిందీ రీమేక్ కి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందా లేదా అని వేచి చూడాలి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story