దుమ్ము లేపుతున్న 'వార్' యాక్షన్!

దుమ్ము లేపుతున్న వార్ యాక్షన్!
x
Highlights

బాలీవుడ్ హీరోలు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ లు నటిస్తున్న వార్ సినిమా తెలుగు ట్రైలర్ ఈరోజు విడుదల చేశారు. పూర్తీ యాక్షన్ సన్నివేశాలతో నిండి ఉన్న ఈ ట్రైలర్ అందర్నీ ఆకట్టుకుంటోంది.

ఇద్దరు బాలీవుడ్ యాక్షన్ హీరోలు ఒకేసినిమాలో కలిసి నటిస్తున్నారు. మరిక యాక్షన్ కి లోటు ఉండదు. ఇదీ ప్రేక్షకుల అంచనా. ఆ అంచనాని నిజం చేసింది వార్ ట్రైలర్. బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ లు ఇద్దరూ కలసి నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం 'వార్'. బ్యాంగ్ బ్యాంగ్ దర్శకుడు సిద్దార్థ ఆనంద్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా హిందీ తో పాటు ఇతర భాషల్లోనూ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికోసం ఇప్పుడు తెలుగు ట్రైలర్ సిద్ధం చేసి విడుదల చేశారు. ఈ ట్రైలర్ యాక్షన్ సన్నివేశాలతో నిండిపోయి ఉంది. హృతిక్, టైగర్ ఇద్దరూ నువ్వా నేనా అన్నట్టు ఆ సన్నివేశాల్లో నటించారు. అదేవిధంగా చేజింగ్ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. వార్ సినిమా ట్రైలర్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో వాణీ కపూర్‌ కథానాయిక. యశ్‌రాజ్‌ ఫిలింస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం గాంధీ జయంతి సందర్భంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories