రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో రామ్ చరణ్!

రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో రామ్ చరణ్!
x

K Raghavendra Rao, Ram Charan Tej 

Highlights

Ram Charan With K Raghavendra Rao : దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు సినిమాల గురించి ఎంత చెప్పిన తక్కువే.. అయన ఏ జోనర్ లో సినిమా తీసిన సరే ఆ సినిమాలు ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా ఉంటాయి..

Ram Charan With K Raghavendra Rao : దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు సినిమాల గురించి ఎంత చెప్పిన తక్కువే.. అయన ఏ జోనర్ లో సినిమా తీసిన సరే ఆ సినిమాలు ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా ఉంటాయి.. దాదాపుగా 100కి పైగా సినిమాలు చేసిన అయన చాలా మంది హీరోలను స్టార్లను చేశారు. అయితే ఇప్పుడు అయన చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ్ ని డైరెక్ట్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పలు ఫ్యాన్ మేడ్ పోస్టర్లు కూడా దర్శనం ఇస్తున్నాయి. చరణ్ 14 వ మూవీగా రాఘవేంద్రరావు డైరెక్షన్ లో ఉంటుందని అంటున్నారు. కానీ దీనిపైన చరణ్, రాఘవేంద్రరావు ఏమంటారో చూడాలి మరి.. ఇక చరణ్ తండ్రి చిరంజీవికి జగదేక వీరుడు అతిలోక సుందరి, ఘరానా మొగుడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్లను అందించారు రాఘవేంద్రరావు..

అటు రాఘవేంద్రరావు తాజాగా తన కొత్త సినిమాను ప్రారంభించారు. 'పెళ్లి సందడి మళ్లీ మొదలవ్వబోతుంది... తారాగణం త్వరలో...' అంటూ అయన తన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ చిత్రాన్ని ఆర్.కె ఫిలిం అసిసియేషన్ బ్యానర్, ఆర్కా మీడియా సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తుండగా, చంద్రబోస్ సాహిత్యం అందిస్తున్నారు. ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా స్టార్ట్ అయిపొయింది. అయితే ఈ సినిమాలో నటీనటులు ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది.

దాదాపుగా మూడేళ్ళ తర్వాత అయన చేస్తున్న సినిమా కావడంతో సినిమా పైన మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక రాఘవేంద్రరావు చివరిగా అక్కినేని నాగార్జున హీరోగా ఓం నమో వెంక‌టేశాయ అనే భక్తీరస చిత్రాన్ని తెరకెక్కించారు. 2017లో వచ్చిన ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణ దక్కించుకుంది. ఆ తర్వాత మళ్ళీ సినిమాలను చేయలేదు. అటు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR సినిమాలో చరణ్ నటిస్తున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories