రాఘవేంద్రరావు 'పెళ్లి సందడి' మళ్ళీ మొదలు కాబోతుంది!

K Raghavendra Rao New Movie : శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ తారాగణంతో దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు తెరకెక్కించిన 'పెళ్లి సందడి' చిత్రం ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..

Krishna
Published on: 9 Oct 2020 12:40 PM IST
రాఘవేంద్రరావు పెళ్లి సందడి మళ్ళీ మొదలు కాబోతుంది!
X

 K Raghavendra Rao

K Raghavendra Rao New Movie : శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ తారాగణంతో దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు తెరకెక్కించిన 'పెళ్లి సందడి' చిత్రం ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. చాలా తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా బంపర్ హిట్ కొట్టింది. ముఖ్యంగా ఈ సినిమాకి కీరవాణి అందించిన పాటలు బాగా ప్లస్ అయ్యాయి.. అయితే ఇప్పుడు ఇదే టైటిల్ తో తన కొత్త సినిమాని అనౌన్స్ చేశారు రాఘవేంద్రరావు..

'పెళ్లి సందడి మళ్లీ మొదలవ్వబోతుంది... తారాగణం త్వరలో...' అని అయన తన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ చిత్రాన్ని ఆర్.కె ఫిలిం అసిసియేషన్ బ్యానర్, ఆర్కా మీడియా సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మళ్ళీ కీరవాణి సంగీతం అందిస్తుండగా, చంద్రబోస్ సాహిత్యం అందిస్తున్నారు. ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా స్టార్ట్ అయిపొయింది. అయితే ఈ సినిమాలో నటీనటులు ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది.

దాదాపుగా మూడేళ్ళ తర్వాత అయన చేస్తున్న సినిమా కావడంతో సినిమా పైన మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక రాఘవేంద్రరావు చివరిగా అక్కినేని నాగార్జున హీరోగా ఓం నమో వెంక‌టేశాయ అనే భక్తీరస చిత్రాన్ని తెరకెక్కించారు. 2017లో వచ్చిన ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణ దక్కించుకుంది. ఆ తర్వాత మళ్ళీ సినిమాలను చేయలేదు.


Krishna

Krishna

Next Story