కొత్త సినిమాకి ముహూర్తం పెట్టిన దర్శకేంద్రుడు!

కొత్త సినిమాకి ముహూర్తం పెట్టిన దర్శకేంద్రుడు!
x

Raghavendra Rao

Highlights

K Raghavendra Rao New Movie : దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు సినిమాల గురించి ఎంత చెప్పిన తక్కువే.. భక్తీ, మాస్, కుటుంబ చిత్రాలను ఎన్నో తెరకెక్కించారు.. దాదాపుగా 100కి పైగా సినిమాలను చేశారు.

K Raghavendra Rao New Movie : దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు సినిమాల గురించి ఎంత చెప్పిన తక్కువే.. భక్తీ, మాస్, కుటుంబ చిత్రాలను ఎన్నో తెరకెక్కించారు.. దాదాపుగా 100కి పైగా సినిమాలను చేశారు. చాలా మంది హీరోలను స్టార్లను చేసిన క్రెడిట్ ఆయనకి ఉంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా అయన సినిమాలకి దూరంగా ఉంటూ వస్తున్నారు రాఘవేంద్రరావు.. అయన చివరిగా అక్కినేని నాగార్జున హీరోగా ఓం నమో వెంక‌టేశాయ అనే భక్తీరస చిత్రాన్ని తెరకెక్కించారు. 2017లో వచ్చిన ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణ దక్కించుకుంది. ఆ తర్వాత మళ్ళీ సినిమాలను చేయలేదు రాఘవేంద్రరావు..

అయితే తాజాగా అయన ఓ కొత్త సినిమాని తెరకెక్కించే పనిలో పడ్డారు. సుదీర్ఘ విరామం త‌ర్వాత కే రాఘ‌వేంద్రరావు త‌న కొత్త చిత్రాన్ని ప్రక‌టించ‌బోతున్నారు. ఈ విషయాన్ని అయనే ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. " అక్టోబ‌ర్ 9 (రేపు) ఉద‌యం 11‌:30 గంట‌ల‌కు కొత్త ప్రాజెక్టును ప్రక‌టించ‌నున్నట్టు వీడియో ద్వారా తెలియ‌జేశారు. ఆహ్వానం..విందు వినోదం.. నిర్మాణ సంస్థ నుంచి రేపు ఉద‌యం 11.30 గంట‌ల‌కు వార్త రాబోతుంది" అని ఆ వీడియోలో పేర్కొన్నారు రాఘ‌వేంద్రరావు..

అయితే తాజా సమాచారం ప్రకారం రాఘవేంద్రరావు ఈ చిత్రాన్ని అంత కొత్త తారాగణంతో తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాకి ఆయనే నిర్మాత అని తెలుస్తోంది. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా కీరవాణి చేయనున్నారు. ప్యూర్ లవ్ సబ్జెక్ట్ గా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. దీనిపైన పూర్తిగా అన్ని తెలియాలంటే రేపటివరకు ఆగాల్సిందే!

Show Full Article
Print Article
Next Story
More Stories