తారక్ ప్రామిస్ చేస్తున్నా.. నీకు బెస్ట్ గిఫ్ట్ ఇస్తా : చరణ్

తారక్ ప్రామిస్ చేస్తున్నా.. నీకు బెస్ట్ గిఫ్ట్ ఇస్తా : చరణ్
x
Highlights

Ram Charan promise To NTR : టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం RRR.. ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు.. ఈరోజు సినిమాకి సంబంధించిన కొత్త అప్డేట్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం.

Ram Charan promise To NTR : టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం RRR.. ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు.. ఈరోజు సినిమాకి సంబంధించిన కొత్త అప్డేట్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం.. 'విశ్రాంతి.. పునరుత్తేజం.. ఉత్సాహంతో ముందుకు..' అంటూ #WeRRRBack అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించింది. దీనికి సంబంధించిన ఓ స్పెషల్ వీడియోను కూడా రిలీజ్ చేసింది. చిత్రీకరణ కోసం అన్నీ సిద్ధం చేసుకున్నామని తెలిపింది. ఇక చివరగా జూనీయర్ ఎన్టీఆర్ (భీమ్) లుక్‌ను ఈ నెల 22న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

అయితే కొమరం భీమ్ గా ఎన్టీఆర్ లుక్ ని ఉద్దేశిస్తూ హీరో రామ్ చరణ్ స్పందించాడు.. 'మై డియర్ బ్రదర్ తారక్.. నీకోసం చాలా రోజుల నుంచి ఒకటి ఇద్దామనుకుంటున్నా. అది ఇప్పుడు సిద్ధమవుతోంది. నీకు నేను ప్రామిస్ చేస్తున్నా. అక్టోబర్ 22కి ఒక బెస్ట్ గిఫ్ట్ ఇస్తాను' అంటూ ట్వీట్ చేశాడు రామ్ చరణ్.. అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ని చూసేందుకు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక అంతకుముందు చరణ్ పుట్టినరోజు సందర్భంగా అల్లూరి సీతారామరాజు లుక్ ని మేకర్స్ ఓ స్పెషల్ వీడియోని రిలీజ్ చేశారు. ఆ వీడియోకి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే..

బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా ఇది... ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. దాదాపుగా 80 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాలో హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్, సముద్రఖని, శ్రియ కూడా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తుండగా, విజయేంద్రప్రసాద్ కథని అందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories