Uppena Movie Trailer: 'ఉప్పెన‌' ట్రైలర్‌ రిలీజ్ చేసిన ఎన్టీఆర్

Samba Siva Rao
Published on: 4 Feb 2021 5:21 PM IST
Uppena Movie Trailer: ఉప్పెన‌ ట్రైలర్‌ రిలీజ్ చేసిన ఎన్టీఆర్
X

ఉప్పెన ట్రైలర్ 

నీ కన్ను నీలిసముద్రం అంటూ తెలుగు సినీ ప్రేమికుల గుండెల్ని ధక్..ధక్..అనిపించిన 'ఉప్పెన' ఇప్పుడు టీజర్ తో మరోసారి ప్రేక్షకులను ప్రేమ జగత్తులో ముంచేసింది. మెగా కాంపౌండ్ నుంచి వస్తున్న వైష్ణవ్ తేజ్.. మొదటి సినిమా విడుదలవకుండానే బోలెడు సినిమాలు బుట్టలో వేసుకున్న క్యూట్ హీరోయిన్ కృతిశెట్టి కాంబినేషన్ లో .. వెరైటీ ప్రేమకథా చిత్రాల దర్శకుడు సుకుమార్ కథతో వస్తున్న సినిమా ఉప్పెన!

ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావలసిన ఈ సినిమా కరోనా మహమ్మారి దెబ్బకు పక్కకు ఉండిపోయింది. ఇప్పుడు ఈ సినిమాని రిలీజ్ చేసే సన్నాహాలు చేస్తోంది యూనిట్. ఫిబ్రవ‌రి 12న ఈ సినిమాని థియేట‌ర్‌ల‌లోకి రానున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. తాజాగా ఉప్పెన సినిమాకు సంబంధించి మరో అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా ట్రేైలర్ గురవారం విడుదలైంది.

ఈ ట్రైలర్‌ ను యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా సినిమా బృందానికి అభినందనలు తెలిపారు. ''ఈ ట్రైలర్‌ విడుదల చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. 'ఆల్‌ ది బెస్ట్‌ బ్రదర్‌'' అని తారక్‌ అన్నారు. ఇప్పటికే మిలియన్ల హృదయాల లైక్ లతో ఉప్పెన పాటలు ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు టీజర్ అదే రేంజిలో దూసుకుపోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్‌కు సినీప్రియుల మంచి రెస్ఫాన్స్ వస్తుంది.

కాగా, ఈ చిత్రంలో త‌మిళ స్టార్ యాక్టర్ విజ‌య్ సేతుప‌తి ఓ కీల‌క పాత్ర పోషించారు. సాయిచంద్, బ్రహ్మాజీ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. సుకుమార్ రైటింగ్స్ భాగ‌స్వామ్యంతో మైత్రి మూవీ మేక‌ర్స్ చిత్రాన్నినిర్మిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకొన్న ఈ సినిమా పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.



Samba Siva Rao

Samba Siva Rao

Next Story