Uppena: మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. 'ఉప్పెన' రిలీజ్ డేట్ ఫిక్స్

Samba Siva Rao
Published on: 26 Jan 2021 7:43 PM IST
Uppena releasing on12th February
X

Uppena releasing on12th February

నీ కన్ను నీలిసముద్రం అంటూ తెలుగు సినీ ప్రేమికుల గుండెల్ని ధక్..ధక్..అనిపించిన 'ఉప్పెన' ఇప్పుడు టీజర్ తో మరోసారి ప్రేక్షకులను ప్రేమ జగత్తులో ముంచేసింది. మెగా కాంపౌండ్ నుంచి వస్తున్న వైష్ణవ్ తేజ్.. మొదటి సినిమా విడుదలవకుండానే బోలెడు సినిమాలు బుట్టలో వేసుకున్న క్యూట్ హీరోయిన్ కృతిశెట్టి కాంబినేషన్ లో .. వెరైటీ ప్రేమకథా చిత్రాల దర్శకుడు సుకుమార్ కథతో వస్తున్న సినిమా ఉప్పెన!

ఈ సినిమా విడుదల తేదీ ఖరారైంది. ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావలసిన ఈ సినిమా కరోనా మహమ్మారి దెబ్బకు పక్కకు ఉండిపోయింది. ఇప్పుడు ఈ సినిమాని రిలీజ్ చేసే సన్నాహాలు చేస్తోంది యూనిట్. ఫిబ్రవ‌రి 12న ఈ సినిమాని థియేట‌ర్‌ల‌లోకి రానున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఇప్పటికే మిలియన్ల హృదయాల లైక్ లతో ఉప్పెన పాటలు ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు టీజర్ అదే రేంజిలో దూసుకుపోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కు సినీప్రియుల మంచి రెస్ఫాన్స్ వస్తుంది.

కాగా, ఈ చిత్రంలో త‌మిళ స్టార్ యాక్టర్ విజ‌య్ సేతుప‌తి ఓ కీల‌క పాత్ర పోషించారు. సాయిచంద్, బ్రహ్మాజీ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. సుకుమార్ రైటింగ్స్ భాగ‌స్వామ్యంతో మైత్రి మూవీ మేక‌ర్స్ చిత్రాన్నినిర్మిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకొన్న ఈ సినిమా పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story