Uppena Teaser Out: ఉప్పెన టీజర్ .. అందమైన ప్రేమకథ

Uppena Teaser Out: ఉప్పెన టీజర్ .. అందమైన ప్రేమకథ
x

ఉప్పెన టీజర్ 

Highlights

నీ కన్ను నీలిసముద్రం అంటూ తెలుగు సినీ ప్రేమికుల గుండెల్ని ధక్..ధక్..అనిపించిన 'ఉప్పెన' ఇప్పుడు టీజర్ తో మరోసారి ప్రేక్షకులను ప్రేమ జగత్తులో ముంచేసింది.

నీ కన్ను నీలిసముద్రం అంటూ తెలుగు సినీ ప్రేమికుల గుండెల్ని ధక్..ధక్..అనిపించిన 'ఉప్పెన' ఇప్పుడు టీజర్ తో మరోసారి ప్రేక్షకులను ప్రేమ జగత్తులో ముంచేసింది. మెగా కాంపౌండ్ నుంచి వస్తున్న వైష్ణవ్ తేజ్.. మొదటి సినిమా విడుదలవకుండానే బోలెడు సినిమాలు బుట్టలో వేసుకున్న క్యూట్ హీరోయిన్ కృతిశెట్టి కాంబినేషన్ లో .. వెరైటీ ప్రేమకథా చిత్రాల దర్శకుడు సుకుమార్ కథతో వస్తున్న సినిమా ఉప్పెన!

ఈ సినిమా టీజర్ ఈరోజు విడుదలైంది. ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావలసిన ఈ సినిమా కరోనా మహమ్మారి దెబ్బకు పక్కకు ఉండిపోయింది. ఇప్పుడు ఈ సినిమాని రిలీజ్ చేసే సన్నాహాలు చేస్తోంది యూనిట్. ఇప్పటికే మిలియన్ల హృదయాల లైక్ లతో ఉప్పెన పాటలు ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు టీజర్ అదే రేంజిలో దూసుకుపోతోంది. ఇవాళ విడుదల అయిన టీజర్ కు సినీప్రియుల మంచి రెస్ఫాన్స్ వస్తుంది. ''దేవుడే వరాలు ఇస్తాడని నాకు అర్థమైంది. ఎవరికి పుట్టామో అందరికీ తెలుస్తుంది. కానీ, ఎవరి కోసం పుట్టామో నా సిన్నప్పుడే తెలిసిపోయింది'' అంటూ వైష్ణవ్ తేజ్ చెప్పే మాటలతో టీజర్ మొదలైంది. మనిద్దరి మధ్యన ప్రేమెందుకని ప్రేమనే పక్కన పెట్టేశా'' అంటూ హీరోయిన్ చెప్పే డైలాగు కూడా ఆకట్టుకుంటోంది.

కాగా, ఈ చిత్రంలో త‌మిళ స్టార్ యాక్టర్ విజ‌య్ సేతుప‌తి ఓ కీల‌క పాత్ర పోషించారు. సాయిచంద్, బ్రహ్మాజీ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. సుకుమార్ రైటింగ్స్ భాగ‌స్వామ్యంతో మైత్రి మూవీ మేక‌ర్స్ చిత్రాన్నినిర్మిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకొన్న ఈ సినిమా పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.



Show Full Article
Print Article
Next Story
More Stories