Naatu Naatu: నాటు నాటు పాటకు ఉక్రెయిన్ ఆర్మీ పేరడీ సాంగ్

Naatu Naatu: నాటు నాటు పాటకు ఉక్రెయిన్ ఆర్మీ పేరడీ సాంగ్
x

Naatu Naatu: నాటు నాటు పాటకు ఉక్రెయిన్ ఆర్మీ పేరడీ సాంగ్

Highlights

ఆర్ ఆర్ ఆర్ మూవీలో రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ నాటు నాటు పాటకు అంతర్జాతీయంగా ఎంత క్రేజ్ దక్కిందో మనందరికీ తెలిసిందే. ఈ మాస్ బీట్ కి ఉన్న క్రేజ్ ను ఉక్రెయినియన్ ఆర్మీ అధికారులు మరో మెట్టుకు తీసుకెళ్లారు. నాటు నాటు పాటకు పేరడీ చేశారు.

RRR Naatu Naatu: ఆర్ ఆర్ ఆర్ మూవీలో రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ నాటు నాటు పాటకు అంతర్జాతీయంగా ఎంత క్రేజ్ దక్కిందో మనందరికీ తెలిసిందే. ఈ మాస్ బీట్ కి అన్ని భాషల ఆడియెన్స్ ఫిదా కావడమే కాదు ఆస్కార్ అవార్డ్ సైతం దక్కింది. ఓ మలయాళీ దినపత్రిక నాటు నాటు పాటకు స్టెప్స్ ఎలా వేయాలో డిటెయిల్డ్ గా ఓ ట్యుటోరియల్ నే ప్రచురించింది. ఈ పాటకు ఆకర్షణ కానీ ఆదరణ కానీ ఇప్పటికీ ఏమాత్రం చెక్కు చెదరలేదు. నాటు నాటు డాన్స్ చేస్తున్న వీడియోలు, రీళ్లు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. ఈ పాటకు ఉన్న క్రేజ్ ను ఉక్రెయినియన్ ఆర్మీ అధికారులు మరో మెట్టుకు తీసుకెళ్లారు. నాటు నాటు పాటకు పేరడీ చేశారు.

ఈ పేరడీ వీడియో సాంగ్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని గేలి చేస్తూ..రష్యన్ ఆర్మీకి వ్యతిరేకంగా ఈ వీడియోని క్రియేట్ చేశారు. ఈ వీడియో సాంగ్ ను లిబెరల్ డెమోక్రటిక్ ఆఫ్ ఉక్రెయిన్ ఉపాధ్యక్షురాలు జేన్ ఫెడోటోవా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ను RRR యూనిట్ థ్యాంక్స్ చెబుతూ రీట్వీట్ చేయడం విశేషం.



Show Full Article
Print Article
Next Story
More Stories