saaho updates: సాహోలో ఆ ఐదూ అదిరిపోతాయట!

saaho updates: సాహోలో ఆ ఐదూ అదిరిపోతాయట!
x
Highlights

ఇంకో రెండు రోజులు.. ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు కల్లుకాయలు కాచేలా చూస్తున్న ఎదురుచూపులకు తెరపడనుంది. సాహో తెరపై యాక్షన్ వర్షాన్ని కురిపించానున్నాడు. సాహోలో ఐదు సన్నివేశాలు ప్రేక్షకులను సీట్లకు కట్టిపారేస్తాయని చిత్ర బృందం చెబుతోంది.. అవేంటో చూసేద్దామా..

యాంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధాకాపూర్ జంటగా.. ప్రపంచస్థాయి భారీ యాక్షన్ మూవీ సాహో విడుదలకు ఇక రెండురోజులే సమయం ఉంది. సరిగ్గా 48 గంటల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమా గురిచిన విశేషాలు తెలుసుకోవాలని అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటివరకూ ఎప్పుడూ చూడని సీన్స్.. యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయని ఇప్పటికే యూనిట్ చేబుతూవస్తోంది. ఇక భారీగా సినిమాకి ఖర్చు చేశారు. ఖర్చు చేసిన ప్రతి పైసా తెర మీద స్పష్టంగా కనిపిస్తుందని సినీవర్గాలు అంటున్నాయి.

ఇక సాహో లో యాక్షన్ సన్నివేశాలు హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. ఈ సినిమాలో ఒక్కో యాక్షన్ సన్నివేశాన్ని ఒక్కో అంతర్జాతీయ యాక్షన్ మాస్టర్స్ డైరెక్ట్ చేశారు. వీటిలో ఐదు సన్నివేశాలు అద్వితీయంగా ఉంటాయట. అవి ఇవేనని చెబుతున్నారు..

1. ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్ ఇంతవరకూ ఏ హీరో చేయని.. ఏ సినిమాలోనూ చూడని విధంగా ఉండబోతోందని చెబుతున్నారు. ఫ్యాన్స్ ని ఉర్రూతలు ఊగిన్చేలా ఈ సన్నివేశం ఉంటుందని అంటున్నారు. దీనిని ఇంటర్నేషనల్ యాక్షన్ డైరెక్టర్ పెంగ్ జాంగ్ డైరెక్ట్ చేశారు. ఈ సీన్ కోసం ప్రత్యేకంగా ప్రభాస్ మూడువారాల పాటు అతి కష్టమైన ట్రైనింగ్ తీసుకున్నారట.

2. ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటివరకూ చూడని గన్ ఫైట్.. డాన్స్ నంబర్ లా ఉండే గన్ ఫైట్ బాబ్ బ్రాన్ డైరెక్షన్లో అద్భుతంగా తెరకెక్కించారని చెబుతున్నారు. ఈ గన్ ఫైట్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోవడం ఖాయమట.

3. ఇంటర్నేషనల్ యాక్షన్ డైరెక్టర్ చేసిన కార్ చేజింగ్ సీన్ సినిమాకే హైలైట్ గా నిలవబోతోందని అంటున్నారు. ఈ కార్ ఛేజ్ ని మూడు వారాల పాటు అబూదాబీలో షూట్ చేశారు. ఈ సీన్ల కోసం ఒకసారి యూనిట్ అంతా అబూదాబీ వెళ్లి అక్కడ సమస్య ఎదురుకావడంతో వెనక్కి వచ్చిందని వార్తలు వచ్చాయి. తరువాత మళ్ళీ వెళ్లి ఈ సీన్లు షూట్ చేసుకువచ్చినట్టు యూనిట్ సభ్యులు చెప్పుకున్నారు. అంత కమిట్ మెంట్ తో తీసిన ఈ సీన్లు అభిమానులను అలరించడం ఖాయం అంటున్నారు.

4. సాహో సినిమా కోసం మొట్టమొదట తీసిన సీన్ అదరహో అనిపిస్తుందని చెబుతున్నారు. బాహుబలి షూటింగ్ జరుగుతున్న సమయంలోనే తీసిన సీన్ ఒకటి ఉంది. ఆ సీన్ బాహుబలి 2 టీజర్ లోనూ కనిపించింది. దీనిని ఇటలీలో షూట్ చేశారు. జెట్ సూట్ వేసుకుని ప్రభాస్ గాల్లో తేలిపోతూ కనిపించే ఈ సీన్ క్లాసికల్ గా నిలిచిపోతున్దంతున్నారు.

5. సాహో క్లైమాక్స్ కూడా పెగ్ జాంగ్ యూరప్ లో తెరకెక్కించారు. ఈ క్లైమాక్స్ యాక్షన్ కూడా ప్రభాస్ హీరోయిజాన్ని సూపర్ లెవెల్లో చూపిస్తుందని చెబుతున్నారు. అభిమానులకు పండగలా ఈ క్లైమాక్స్ ఉండబోతోన్దంతున్నారు.

సాహో మేనియాకు ఇప్పటికే సినీ ప్రపంచం ఊగిపోతోంది. ఇక సినిమా విడుదలయ్యాకా ఈ సీన్స్ ఎంత మ్యాజిక్ చేస్తాయో ఎల్లుండి తేలిపోనుంది. ఇప్పటివరకైతే భారత దేశ సినీ చరిత్రలోనే ఇంత క్రేజ్ సాధించిన సినిమా లేదనేది స్పష్టం.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories