Dil Raju Daughter Hanshitha Reddy Emotional Post: దిల్ రాజు కుమార్తె ఎమోష‌న‌ల్ పోస్ట్.. అమ్మ ఫోటో షేర్ చేస్తూ..

Dil Raju Daughter Hanshitha Reddy Emotional Post: టాలీవుడ్ బడా నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు.. ఆయితే అయన మొదటి భార్య అనిత 2017లో గుండెపోటుతో మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే.

Krishna
Published on: 10 July 2020 2:15 PM IST
Dil Raju Daughter Hanshitha Reddy Emotional Post: దిల్ రాజు కుమార్తె ఎమోష‌న‌ల్ పోస్ట్.. అమ్మ ఫోటో షేర్ చేస్తూ..
X
Hanshitha Reddy, Dil Raju (File Photo)

Dil Raju Daughter Hanshitha Reddy Emotional Post: టాలీవుడ్ బడా నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు.. ఆయితే అయన మొదటి భార్య అనిత 2017లో గుండెపోటుతో మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. ఆమె మరణం తర్వాత ఆమెకి సంబంధించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు ఆమె కూతురు హన్షిత... తాజాగా ఆమె తల్లి అనితతో ఉన్న ఓ ఫోటోను షేర్ చేస్తూ.. " నీతో ఎన్నో జ్ఞాపకాలు.. నేను ఎక్కువగా నీతో కలిసి ఫోటోలు దిగాను. నీ చిరునవ్వు దృశ్యాల చిత్రాలెన్నో. నీ దృష్టిలో ప్రేమ అంటే... ఎప్పటిలాగే నన్ను గట్టిగా కౌగిలించుకోవ‌డం" అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది హన్షిత.

ఇక దిల్ రాజు తన మొదటి భార్య అనిత మరణించిన తర్వాత తాజాగా ఎయిర్ హోస్టెస్ తేజస్విని రెండో వివాహం చేసుకున్నారు. ఈ వివాహాన్ని దిల్ రాజు కుమార్తె హన్షితనే దగ్గరుండి జరిపించారు. ఇక అటు హన్షితకి ఇషిక అనే కుమార్తె ఉండగా తన కూతురులోనే తన తల్లిని చూసుకుంటున్నానని హ‌న్షిత తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. దిల్ రాజు తన నిర్మాణ సంస్థను కూడా ఆమె పేరు పైనే స్థాపించారు.

ఇక ఈ ఏడాది సంక్రాంతికి మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి హిట్ కొట్టిన దిల్ రాజు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా వకీల్ సాబ్ అనే సినిమాని తెరకేక్కిస్తున్నాడు. ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక నాని, సుదీర్ బాబు హీరోలుగా తెరకెక్కిన దిల్ రాజు తెరకెక్కించిన v సినిమా విడుదలకి సిద్దంగా ఉంది. దీనికి ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వం వహించారు.



Krishna

Krishna

Next Story