Pawan Kalyan Decision on His UpComing Projects: అప్ కమింగ్ ప్రాజెక్ట్ లపైన కీలక ప్రకటన చేసిన పవన్!

Pawan Kalyan Decision on His UpComing Projects: 2019 ఎన్నికలకి ముందు రాజకీయాల్లోకి వెళ్ళిన పవన్ కళ్యాణ్ మళ్ళీ రెండేళ్ళ తర్వాత సినిమాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చివరగా

Krishna
Published on: 25 July 2020 8:15 PM IST
Pawan Kalyan Decision on His UpComing Projects:  అప్ కమింగ్ ప్రాజెక్ట్ లపైన కీలక ప్రకటన చేసిన పవన్!
X
Pawan kalyan ( File Photo)

Pawan Kalyan Decision on His UpComing Projects: 2019 ఎన్నికలకి ముందు రాజకీయాల్లోకి వెళ్ళిన పవన్ కళ్యాణ్ మళ్ళీ రెండేళ్ళ తర్వాత సినిమాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చివరగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అజ్ఞాతవాసి అనే సినిమాలో నటించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీగా వకీల్ సాబ్ అనే సినిమా తెరకెక్కుతుంది. బాలీవుడ్ లో మంచి హిట్ అయిన పింక్ సినిమాకి ఇది రీమేక్.. ఇందులో పవన్ కళ్యాణ్ లాయర్ గా కనిపిస్తున్నారు. ఈ సినిమాని దిల్ రాజు, బోని కపూర్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తుండగా, వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా వలన వాయిదా పడింది. తిరిగి ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

అయితే తన అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ పైన పవన్ కళ్యాణ్ తాజాగా స్పందించాడు.. జనసేన పార్టీ సోషల్ మీడియా విభాగానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా అయన తాను చేయబోయే సినిమాల గురించి మాట్లాడారు. ప్రస్తుతం కరోనా వలన చాలా షూటింగ్ లు వాయిదా పడ్డాయి. మళ్ళీ ఎప్పుడు మొదలు అవుతాయో తెలియదు. తొందరపడి షూటింగులు చేసుకున్నా కష్టమేనని పవన్ అన్నారు. ఈ మధ్య సినీ పెద్దలు కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని కలిశారు. అనుమతులు ఇచ్చినప్పటికీ షూటింగ్ చేసే పరిస్థితులు లేవు అని పవన్ అభిప్రాయపడ్డారు. తాజాగా అమితాబచ్చన్ గారికి కరోనా వచ్చిందని, ఎవరికి వచ్చినా.. ఇబ్బందే కాబట్టి వాక్సిన్ వచ్చేవరకు నిస్సహాయతతో వెయిట్ చేస్తూ ఉండాల్సిందే అంటూ చెప్పుకొచ్చారు పవన్!

ఇక ఈ సినిమా తరవాత పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాని ఇప్పటికే మొదలు పెట్టేశాడు పవన్.. భారీ బడ్జెట్ తో ఈ సినిమాని ఏ ఎమ్ రత్నం నిర్మిస్తున్నారు.. ఇక ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాని ప్లాన్ చేశారు పవన్..పూరి జగన్నాథ్ , త్రివిక్రమ్ డైరెక్షన్ లలో కూడా పవన్ ఓ సినిమా చేయనున్నారని సమాచారం.

Krishna

Krishna

Next Story