Nithiin Pre Wedding Function: ఒకే వేదిక పైన త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్!

Nithiin Pre Wedding Function: పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ వెండితెర పైన ఎంత సూపర్ హిట్టు అనేది అందరికి తెలిసిందే..

Krishna
Published on: 24 July 2020 8:52 PM IST
Nithiin Pre Wedding Function: ఒకే వేదిక పైన త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్!
X
Pawan kalyan, trivikram meet again in nithin prewedding

Nithiin Pre Wedding Function: పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ వెండితెర పైన ఎంత సూపర్ హిట్టు అనేది అందరికి తెలిసిందే.. వీరి కాంబినేషన్లో ఇప్పటివరకు మూడు సినిమాలు వస్తే అందులో రెండు మంచి విజయాలను అందుకున్నాయి. సినిమాలతో కంటే వీరిద్దరి మధ్య ఉన్న స్నేహబంధమే ఎక్కువ.. అయితే పవన్ పూర్తిగా రాజకీయాలకి అంకితం అయిపోయారు. ఇక అటు త్రివిక్రమ్ వేరే హీరోలతో సినిమాలు చేస్తూ బిజీ అయిపోయారు. దీనితో త్రివిక్రమ్, పవన్ ఒకే స్టేజీ పైన కనిపించి చాలా రోజులైంది.

అయితే తాజాగా వీరిద్దరూ హీరో నితిన్‌ వివాహ ముందస్తు వేడుకకు కలిసి రావడం అందరి దృష్టిని ఆకర్షించింది. పెళ్లి కన్నా ముందే వీరు ముందస్తు వేడుకకు హాజరై నితిన్‌ను ఆశీర్వదించారు.. ఇక వీరితో పాటుగా నిర్మాత ఎస్.రాధాకృష్ణ (చినబాబు) కూడా ఉన్నారు. ఇందులో పవన్ పూర్తిగా ఆధ్యాత్మిక గెటప్‌లో కనిపించారు గుబురు గడ్డం, బొట్టుతో కనిపించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చాతుర్మాస్య దీక్షలో ఉన్న సంగతి విధితమే.. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక ఆదివారం రాత్రి 8.30 గంటలకు నితిన్-షాలినిలు వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు. ఇప్పటికే పెళ్ళికి సంబంధించిన ఏర్పాట్లు చక చక జరుగుతున్నాయి. ఇక అటు ప్రీ వెడ్డింగ్‌ కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి. ఇక పెళ్ళికి ముందు నిర్వహించే మెహందీ కార్యక్రమం కూడా ఘనంగా జరిగింది. అటు ప్రభుత్వ నిబంధనల ప్రకారమే నితిన్ పెళ్లి జరుగుతుంది. ఈ వివాహ వేడుకకు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారు.



Krishna

Krishna

Next Story