Keerthy Suresh Role In Sarkaru Vaari Paata: 'సర్కారి వారి పాట'లో కీర్తి రోల్ ఇదేనట!

Keerthy Suresh Role In Sarkaru Vaari Paata: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గీత గోవిందం ఫేమ్ పరుశురాం దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఇది మహేష్ బాబుకి 27 సినిమా..

Krishna
Published on: 9 July 2020 12:27 PM IST
Keerthy Suresh Role In Sarkaru Vaari Paata: సర్కారి వారి పాటలో కీర్తి రోల్ ఇదేనట!
X
Keerthy Suresh Role Revealed In Sarkaru Vaari Paata

Keerthy Suresh Role In Sarkaru Vaari Paata: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గీత గోవిందం ఫేమ్ పరుశురాం దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఇది మహేష్ బాబుకి 27 సినిమా.. ఈ సినిమాకి 'సర్కారి వారి పాట' అనే టైటిల్ ఫిక్స్ చేశారు.. మహేష్ బాబు తండ్రి కృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ కి విశేషమైన స్పందన వచ్చింది.. ఈ పోస్టర్ లో మహేశ్‌ మాస్‌ లుక్‌లో ఆకట్టుకున్నారు. చెవి పోగుతో మెడపై రూపాయి టాటూతో మహేశ్‌ సరికొత్తగా కనిపించారు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.. ఇప్పటికే ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా తెలిపారు.

అయితే ఈ సినిమాలో కీర్తి సురేష్ పాత్ర ఇదేనంటూ ఓ న్యూస్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది..ఈ మూవీలో కీర్తి సురేశ్ బ్యాంకు ఉద్యోగిగా..మహేశ్ బాబు తల్లి సహాద్యోగిని పాత్రలో కనిపించనున్నట్టు టాక్ వినిపిస్తోంది.. ఆమె పాత్ర సినిమా మొత్తంలో ఫన్నీగా ఉంటుందని తెలుస్తోంది.. దీనిపైన ప్రస్తుతానికి ఎలాంటి అధికార ప్రకటన లేదు. ఇక మరో హీరోయిన్ గా నివేదా థామస్ ని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్, జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నాడు.

బ్యాంకింగ్ వ్యవస్థలో లోపాలు, ఫ్రాడ్స్ వంటి విషయాల నేపథ్యంలో ఈ మూవీ కథ నడుస్తుందని తెలుస్తోంది. ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలపాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.. ఈ సినిమాలో కన్నడ హీరో ఉపేంద్ర విలన్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది. 'సరిలేరు నేకేవ్వరు' వంటి బ్లాక్ బస్టర్ తరువాత వస్తున్న మహేష్ చిత్రం కావటంతో ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి.

Krishna

Krishna

Next Story