BiggBoss 4 హోస్ట్ గా అక్కినేని వారి కోడలు?

BiggBoss 4 హోస్ట్ గా అక్కినేని వారి కోడలు?
x
Highlights

bigboss 4:నార్త్ లో పుల్ పాపులర్ అయిన బిగ్ బాస్ షో సౌత్ లో కూడా సత్తా చాటుతుంది.. ఇక తెలుగులో ఇప్పటికే మూడు సీజన్స్ ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకొని నాలుగో సీజన్ కి రెడీ అయిపోతుంది..

నార్త్ లో పుల్ పాపులర్ అయిన బిగ్ బాస్ షో సౌత్ లో కూడా సత్తా చాటుతుంది.. ఇక తెలుగులో ఇప్పటికే మూడు సీజన్స్ ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకొని నాలుగో సీజన్ కి రెడీ అయిపోతుంది.. ఇందులో హీరో త‌రుణ్‌, వ‌ర్షిణి, మంగ్లీ, అఖిల్ స‌ర్తాక్, బిత్తిరి స‌త్తి త‌దిత‌రులు ఉంటారన్న ప్రచారం సాగుతోంది.. అయితే ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే ఈ సీజన్ కి హోస్ట్ గా అక్కినేని వారి కోడలు, స్టార్ హీరోయిన్ సమంత హోస్ట్ చేయనున్నారన్న ప్రచారం సాగుతోంది..

తెలుగులో ప్రసారం అయిన మూడు సీజన్స్ కి హోస్ట్ గా మేల్ ఆర్టిస్ట్ లు మాత్రమే వ్యవహరించారు.... మొదటి సీజన్ కి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా, రెండో సీజన్ కి నాని, మూడో సీజన్ కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.. అయితే ఇప్పుడు కొత్తగా షో నిర్వహకులు ఫిమేల్ సెలబ్రిటీతో ఈ ఏడాది సీజన్ ని నిర్వహించాలని అనుకుంటున్నారట.. అందులో భాగంగానే సమంత పేరును పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది.. దీనికి సమంత ఒప్పుకుంటే మాత్రం ఇది గొప్ప విషయమే అని చెప్పవచ్చు.

ప్రస్తుతం సమంత చేతిలో కూడా ఎక్కువగా సినిమాలు కూడా లేవు.. తమిళ్ లో ఓ సినిమా మాత్రమే చేస్తోంది సమంత.. ఇక బిగ్ బాస్ మూడో సీజన్ లో అక్కినేని నాగార్జున లేని సమయంలో రమ్యకృష్ణ రెండు ఎపిసోడ్స్ కి హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories