ఇవాల్టి నుంచి స్టార్ మాలో బిగ్ బాస్ సీజన్ వన్

ఇవాల్టి నుంచి స్టార్ మాలో బిగ్ బాస్ సీజన్ వన్
x
Jr.NTR (File Photo)
Highlights

తెలుగు బుల్లితెర పై బిగ్ బాస్ షో కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

తెలుగు బుల్లితెర పై బిగ్ బాస్ షో కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఇప్పటి వరకు వచ్చిన మూడు సీజన్స్ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.. ఇందులో మొదటి సీజన్ ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయగా, రెండవ సీజన్ ని నాచురల్ స్టార్ నాని హోస్ట్ చేశాడు..ఇక మూడవ సీజన్ నీ అక్కినేని నాగార్జున హోస్ట్ చేసి అలరించాడు. అయితే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ వన్ మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుంది.

కరోనా వైరస్ ప్రభావం వలన కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో షూటింగ్ లు వాయిదా పడ్డాయి. అయితే టీఆర్పీ కోసం గతంలో ప్రేక్షక ఆదరణ పొందిన సీరియల్స్, సినిమాలు, షోలను తిరిగి మళ్లీ టెలికాస్ట్ చేస్తున్నాయి. అందులో భాగంగానే స్టార్ మా యాజమాన్యం మళ్లీ బిగ్ బాస్ సీజన్ వన్ ని టెలికాస్ట్ చేయడానికి సిద్ధం అయింది. ఇవాళ్టి నుంచి బిగ్ బాస్ మొదటి సీజన్ మాలో టెలికాస్ట్ కానుంది..

ఇక బిగ్ బాస్ ఫస్ట్ సీజన్‌లో అర్చన, సమీర్, ముమైత్ ఖాన్, ప్రిన్స్, సింగర్ మధుప్రియ, సంపూర్ణేష్ బాబు, జ్యోతి, సింగర్ కల్పన, మహేష్ కత్తి, కత్తి కార్తీక, శివబాలాజీ, ఆదర్శ, హరితేజ, ధనరాజ్, దీక్ష, నవదీప్‌ కంటెస్టంట్స్‌గా ఉన్నారు. ఇందులో దీక్ష, నవదీప్ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చారు. ఫైనల్ కంటెస్టెంట్స్‌గా ఆదర్శ్, శివబాలాజీ, హరితేజ, నవదీప్, అర్చన మిగిలారు. చివరి ఎపిసోడ్‌లో శివబాలాజీ విన్నర్‌ నిలవగా... ఆదర్శ్ రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే..



Show Full Article
Print Article
More On
Next Story
More Stories