Ravi Teja Krack Movie Release in Online: ఓటీటీలో రవితేజ క్రాక్?

Ravi Teja Krack Movie Release in Online: లాక్ డౌన్ వలన బాగా నష్టపోయిన సినిమా ఇండస్ట్రీ మెల్లిమెల్లిగా మళ్ళీ పుంజుకుంటుంది. రెండు తెలుగు రాష్ట్రల ప్రభుత్వాలు ఇచ్చిన గైడ్ లైన్స్ ఆధారంగా బుల్లితెర, వెండితెరకి సంబంధించిన షూటింగ్ లు మళ్ళీ పట్టాలేక్కుతున్నాయి.
Ravi Teja Krack Movie Release in Online: లాక్ డౌన్ వలన బాగా నష్టపోయిన సినిమా ఇండస్ట్రీ మెల్లిమెల్లిగా మళ్ళీ పుంజుకుంటుంది. రెండు తెలుగు రాష్ట్రల ప్రభుత్వాలు ఇచ్చిన గైడ్ లైన్స్ ఆధారంగా బుల్లితెర, వెండితెరకి సంబంధించిన షూటింగ్ లు మళ్ళీ పట్టాలేక్కుతున్నాయి. ఇక ధియేటర్లు ఓపెన్ కాకపోవడంతో విడుదలకి సిద్దంగా ఉన్న సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే కీర్తి సురేష్ పెంగ్విన్, సిద్దు హీరోగా నటించిన కృష్ణ అండ్ హీజ్ లీలా, నవీన్ చంద్ర భానుమతి & రామకృష్ణ మొదలగు చిత్రాలు ఓటీటీలో రిలీజ్ అయి మంచి టాక్ ను సంపాదించుకున్నాయి.
అయితే తాజా సమాచారం ప్రకారం రవితేజ క్రాక్ కూడా ఓటీటీలో విడుదల కానుందని అంటున్నారు. డాన్ శీను బలుపు చిత్రాల తరవాత గోపిచంద్ మలినేని, రవితేజ కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. దీనితో ఈ సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్‌కు చక్కటి స్పందన లభించింది. ఇందులో రవితేజ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా. సముద్రఖని, వరలక్ష్మిశరత్‌కుమార్, దేవీప్రసాద్, పూజిత పొన్నాడ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.. ఈ చిత్రానికి సంగీతం థమన్ సంగీతం అందిస్తుండగా, సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ పతాకంపై బి. మధు నిర్మిస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది.
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేసేందుకు గాను మేకర్స్ చర్చలు జరుపుతున్నట్టుగా సమాచారం.. దీనిపైన త్వరలో. క్లారిటీ రానుంది. ఇక ఈ సినిమా తర్వాత రవితేజ రాక్షసుడు ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమాని చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.. అంతేకాకుండా వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమాని కూడా లైన్ లో పెట్టాడు రవితేజ.
Amit Shah: ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణలో అధికారం భాజపాదే
3 July 2022 1:15 PM GMTభాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
3 July 2022 2:40 AM GMTహైదరాబాద్‌లో కొనసాగుతున్న ఫ్లెక్సీ వార్.. కేసీఆర్ ఫ్లెక్సీలపై మోడీ ఫ్లెక్సీలు!
2 July 2022 1:30 PM GMTటీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ షాక్.. రూ. 96.21 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ..
2 July 2022 12:57 PM GMTమోడీకి అనేక ప్రశ్నలు సంధించిన కేసీఆర్.. రేపటి బహిరంగ సభలో జవాబులివ్వాలని సవాల్..
2 July 2022 12:30 PM GMTమోడీ భాగ్యలక్ష్మిని దర్శించుకుంటారా?
2 July 2022 11:48 AM GMTTalasani Srinivas Yadav: బీజేపీ సిద్ధమైతే.. అందుకు మేమూ రెడీ..
2 July 2022 11:15 AM GMT
Narendra Modi: తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతోంది
3 July 2022 2:30 PM GMTPM Narendra Modi: తెలుగులో ప్రసంగం ప్రారంభించిన మోదీ...
3 July 2022 2:09 PM GMTTelangana: శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి తప్పిన ప్రమాదం
3 July 2022 2:00 PM GMTకళాకారుల డప్పు చప్పుళ్లు, నృత్యాల నడుమ వేదికపైకి ప్రధాని మోదీ
3 July 2022 1:44 PM GMTPawan Kalyan: ప్రభుత్వ పథకాల్లో చాలా మందికి కోత పెడుతున్నారు
3 July 2022 1:26 PM GMT