Shivani Rajashekar as Vennela: శివాని డెబ్యూ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

Shivani Rajashekar as Vennela: టాలీవుడ్ లో వారసుల ఎంట్రీ కొత్తేమి కాదు.. ఇప్పటికే చాలా మంది స్టార్స్ తమ వారసులను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

Krishna
Published on: 1 July 2020 12:50 PM IST
Shivani Rajashekar as Vennela: శివాని డెబ్యూ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
X

Shivani Rajashekar as Vennela: టాలీవుడ్ లో వారసుల ఎంట్రీ కొత్తేమి కాదు.. ఇప్పటికే చాలా మంది స్టార్స్ తమ వారసులను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. రామ్ చరణ్, వరుణ్ తేజ్, నాగచైతన్య, రోహన్ మొదలగు వారు హీరోలు కొనసాగుతున్నారు.. గత ఏడాది యాంగ్రీ హీరో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక దొరసాని సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.. ఈ సినిమాతో టాలెంటెడ్ హీరోయిన్ ఇండస్ట్రీకి దొరికినట్టేనని అందరూ అనుకున్నారు... ప్రస్తుతం శివాత్మిక రెండు సినిమాలతో బిజీగా వుంది..

ఇక రాజశేఖర్ జీవితల మొదటి కుమార్తె శివాని ఎంట్రీ కూడా ఫిక్స్ అయిపోయింది. ఈ రోజు శివాని బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆమె న‌టిస్తున్న తొలి చిత్రం ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు మేకర్స్.. ఆమె లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. వెన్నెల అనే పాత్ర‌లో శివానీ కనిపిస్తుంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ని ఇంకా అనౌన్స్ చేయలేదు.. ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన‌ తేజ స‌జ్జా చిత్రంలో ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాని సుమంత్‌తో కలిసి నరుడా డోనరుడా సినిమా మల్లిక్ రామ్ రూపొందిస్తున్నాడు.

ఇక ఇద్దరు కూతుళ్ళతో పాటుగా రాజశేఖర్ కూడా హీరోగా సినిమాలు చేస్తున్నారు. గరుడవేగ సినిమాతో మళ్లీ మంచి సక్సెస్ లోకి వచ్చిన రాజశేఖర్ గత ఏడాది కల్కి సినిమాతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం తన బ్యానర్ లొనే ఓ కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ సినిమాని చేస్తున్నారు. విలన్ గా కూడా రాజశేఖర్ సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది.


Krishna

Krishna

Next Story