బ్రహ్మీ గాంధీ స్కెచ్.. అద్భుతం అంటున్న నెటిజన్లు!

Brahmanandam Gadhi Sketch : వెండితెరపైన హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ఎంత నవ్విస్తారో అందరికి తెలిసిందే.. అయితే లాక్ డౌన్ పుణ్యమా అని అయనలోని సరికొత్త టాలెంట్ అందరికి కనిపించింది.

Krishna
Published on: 3 Oct 2020 12:12 PM IST
బ్రహ్మీ గాంధీ స్కెచ్..  అద్భుతం అంటున్న నెటిజన్లు!
X

Brahmanandam Mahatma Gandhi Sketch 

Brahmanandam Gadhi Sketch : వెండితెరపైన హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ఎంత నవ్విస్తారో అందరికి తెలిసిందే.. అయితే లాక్ డౌన్ పుణ్యమా అని అయనలోని సరికొత్త టాలెంట్ అందరికి కనిపించింది. సినిమాలు లేకపోవడంతో బ్రహ్మానందం ఇంట్లోనే కాలక్షేపం చేస్తున్నారు. ఖాళీ సమయంలో చిత్రలేఖనంలో తనకున్న ప్రావీణ్యాన్ని బయటపెడుతున్నారు. వరుసగా స్కెచ్ లు గీసి ప్రేక్షకులను అబ్బుర పరుస్తున్నారు. ఆ మధ్య రాముడిని ఆలింగనం చేసుకున్న హనుమంతుడు స్కెచ్ ని, శ్రీశ్రీ స్కెచ్ ని గీసి వావ్ అనిపించారు. తాజాగా నిన్న గాంధీ జయంతి సందర్భంగా జాతిపిత బాపు స్కెచ్‌ను అద్భుతంగా గీసారు బ్రహ్మానందం.. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నెటిజన్లు అద్భుతం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక గత కొంతకాలంగా బ్రహ్మానందం సినిమాల్లో కనిపించడం లేదు.. ప్రస్తుతం అయన క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రంగమార్తాండ' సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ఆయనది చాలా ముఖ్యమైన రోల్ అని తెలుస్తోంది, మరాఠీ భాషలో మంచి హిట్ అయిన నటసామ్రాట్‌ సినిమాకి ఇది రీమేక్.. ఇందులో ప్రకాశ్‌రాజ్‌ మెయిన్ లీడ్ లో నటిస్తున్నారు. రమ్యకృష్ణ మరో కీలక పాత్రలో నటిస్తుంది. ప్రస్తుతం కరోనా వలన ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.

Krishna

Krishna

Next Story