Brahmanandam : చేతులతో మట్టి గణపతిని చేసిన బ్రహ్మీ .. గ్రేట్ అంటున్న నెటిజన్లు!

Brahmanandam : వినాయక చవితి వచ్చిందంటే చాలు.. వీధివీధికి గణపయ్య దర్శనం ఇస్తాడు.. భారీ విగ్రహాలు, మండపాలు ఏర్పాటుచేసి ఎంతో ఘనంగా వినాయక

Krishna
Published on: 22 Aug 2020 3:42 PM IST
Brahmanandam : చేతులతో మట్టి గణపతిని చేసిన బ్రహ్మీ  .. గ్రేట్ అంటున్న నెటిజన్లు!
X

Brahmanandam made a clay Ganesha with his hands

Brahmanandam : వినాయక చవితి వచ్చిందంటే చాలు.. వీధివీధికి గణపయ్య దర్శనం ఇస్తాడు.. భారీ విగ్రహాలు, మండపాలు ఏర్పాటుచేసి ఎంతో ఘనంగా వినాయక చవితిని చాలా గొప్పగా జరుపుకుంటారు తెలుగు రాష్ట్రాల ప్రజలు.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.. కరోనా నేపధ్యంలో వీధుల్లో గణనాథులను ప్రతిష్టించడానికి ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వలేదు. దీనితో ఎవరు ఇంట్లో వాళ్ళే గణపయ్యని ప్రతిష్టించుకొని పూజలు చేసుకుంటున్నారు.. ఇక ఎక్కువ మంది తమ ఇళ్లలో మట్టి వినాయకులను ప్రతిష్టించుకోవడం మరో విశేషం అని చెప్పవచ్చు..

అందులో భాగంగానే టాలీవుడ్ హాస్య బ్రహ్మా బ్రహ్మానందం తమ నివాసంలో తన చేతితో మట్టి వినాయకుడిని తయారుచేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ముందుగా వీటిని ఎవరు షేర్ చేశారో తెలియదు కానీ సోషల్ మీడియాలో ఈ ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి.. ఇక ఈ ఫోటోల పైన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

లాక్ డౌన్ వలన గత కొన్ని నెలలుగా ఇంటికే పరిమితం అయ్యారు బ్రహ్మానందం.. అందులో భాగంగా చాలా పుస్తకాలను చదువుతూ కాలం గడుపుతున్నారు.. అంతేకాకుండా తన ఇంట్లో మనవడుతో అడకుంటూ చాలా సరదాగా గడుపుతున్నారు బ్రహ్మానందం ..ఇక గత కొంతకాలంగా బ్రహ్మానందం సినిమాల్లో కనిపించడం లేదు.. ప్రస్తుతం అయన క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రంగమార్తాండ' సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ఆయనది చాలా ముఖ్యమైన రోల్ అని తెలుస్తోంది, మరాఠీ భాషలో మంచి హిట్ అయిన నటసామ్రాట్‌ సినిమాకి ఇది రీమేక్.. ఇందులో ప్రకాశ్‌రాజ్‌ మెయిన్ లీడ్ లో నటిస్తున్నారు. రమ్యకృష్ణ మరో కీలక పాత్రలో నటిస్తుంది.

Krishna

Krishna

Next Story