Brahmanandam's Sketch Of Lord Ram : బ్రహ్మానందం సూపర్ స్కెచ్.. అభిమానులు ఫిదా!

Brahmanandam's Sketch Of Lord Ram : తెలుగు వెండితెర హాస్యబ్రహ్మ బ్రహ్మానందం తనలోని అద్భుతమైన కళను మరోసారి బయటపెట్టారు.

Krishna
Published on: 6 Aug 2020 10:34 AM IST
Brahmanandams Sketch Of Lord Ram : బ్రహ్మానందం సూపర్ స్కెచ్.. అభిమానులు ఫిదా!
X

Brahmanandam's Sketch Of Lord Ram : తెలుగు వెండితెర హాస్యబ్రహ్మ బ్రహ్మానందం తనలోని అద్భుతమైన కళను మరోసారి బయటపెట్టారు. నిన్న అయోధ్య రామమందిర నిర్మాణానికి పునాది రాయి పడిన సంగతి తెలిసిందే.. ఈ అయోధ్య రామ మందిరం భూమిపూజను యావత్ దేశం విక్షించింది. అయితే బ్రహ్మానందం తనలోని టాలెంట్ ని మరోసారి ప్రూవ్ చేస్తూ.. శ్రీరాముడి స్కెచ్ వేశారు..ఆ స్కెచ్ లో ''ఆంజ‌నేయుని ఆనంద భాష్పాలు'' అని పేర్కొంటూ శ్రీరాముడిని ఆలింగనం చేసుకుని ఆంజనేయుడు తన్మయత్వంతో కన్నీళ్లు కారుస్తున్న అద్భుత చిత్రాన్ని గీశారాయన.. బ్రహ్మానందం గీసిన ఈ స్కెచ్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.

లాక్ డౌన్ వలన గత కొన్ని నెలలుగా ఇంటికే పరిమితం అయ్యారు బ్రహ్మానందం.. అందులో భాగంగా చాలా పుస్తకాలను చదివినట్టుగా అయన వెల్లడించారు. ఖురాన్‌ కూడా అధ్యయనం చేశానని అయన అన్నారు. ఆ పవిత్ర గ్రంథంలో ఏయే అంశాలున్నాయని అయన వెల్లడించారు. అంతేకాకుండా తన ఇంట్లో మనవడుతో అడకుంటూ చాలా సరదాగా గడుపుతున్నారు బ్రహ్మానందం ..

ఇక గత కొంతకాలంగా బ్రహ్మానందం సినిమాల్లో కనిపించడం లేదు.. ప్రస్తుతం అయన క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రంగమార్తాండ' సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ఆయనది చాలా ముఖ్యమైన రోల్ అని తెలుస్తోంది, మరాఠీ భాషలో మంచి హిట్ అయిన నటసామ్రాట్‌ సినిమాకి ఇది రీమేక్.. ఇందులో ప్రకాశ్‌రాజ్‌ మెయిన్ లీడ్ లో నటిస్తున్నారు. రమ్యకృష్ణ మరో కీలక పాత్రలో నటిస్తుంది.

Krishna

Krishna

Next Story