శ్రీముఖి పిడకానందం.. తమన్నా జైలు విషాదం.. బిగ్ బాస్ వినోదం!

శ్రీముఖి పిడకానందం.. తమన్నా జైలు విషాదం.. బిగ్ బాస్ వినోదం!
x
Highlights

శ్రీముఖి పిడకల గోల.. వితిక కాసుల వేట..శివజ్యోతి 'దీప'రాగం.. తమన్నా వార్నింగ్ ల పాట.. జైలులో ఓదార్పు యాత్ర.. ఇవీ బిగ్ బాస్ ఎపిసోడ్ 11...

శ్రీముఖి పిడకల గోల.. వితిక కాసుల వేట..శివజ్యోతి 'దీప'రాగం.. తమన్నా వార్నింగ్ ల పాట.. జైలులో ఓదార్పు యాత్ర..

ఇవీ బిగ్ బాస్ ఎపిసోడ్ 11 విశేషాలు.

ఇప్పటివరకూ బిగ్ బాస్ ఎపిసోడ్లన్నటికీ భిన్నంగా సాగింది. ఈ ఎపిసోడ్. గత సైకిల్ ఎపిసోడ్ కంటిన్యూ అయింది. అందరూ కష్టపడి కానిచ్చారు. ఇక పదర..పదరా పాటకి పిచ్చగా డాన్స్ చేసి రచ్చ చేసింది తమన్నా. ఆ వెంటనే అలీ కి చుక్కలు చూపెట్టింది. స్నానం చేసి వస్తున్న అలీ ని హౌస్ లో ఎక్స్పోజింగ్ ఏమిటంటూ ప్రశ్నించింది. నా ఇష్టం.. నాకు నచ్చినట్టు వుండే స్వేచ్చ లేదా అంటూ అలీ రియాక్టయ్యాడు. ఇదిలా వుంటే.. తిన్న ప్లేట్ కదగకుండా తమన్నా పెట్టేసిందని అందరూ తమన్నని టార్గెట్ చేశారు. దీంతో తను బౌల్ లో తిన్నాననీ, దానిని కడిగి పెట్టేసేననీ, తనని టార్గెట్ చేస్తే బావుండదనీ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది హౌస్ మేట్స్ కి.

శ్రీముఖి పిడకల గోల..

నిర్ణీత సమయంలో వంద పిడకలు వేయాలని శ్రీముఖి, అలీ లకు బిగ్ బాస్ పెద్ద పని పెట్టాడు. అలా చేస్తే గ్యాస్ వస్తుందని మెలిక పెట్టాడు. దీంతో ఇద్దరూ పిడకలు కొట్టి టార్గెట్ పూర్తి చేశారు. టార్గెట్ పూర్తయిన సంతోషంలో శ్రీముఖిలోని పటాస్ బయటకు వచ్చింది. హౌస్ మేట్స్ అందరికీ ముద్దులు పెట్టి..అలీ కి పెద్ద హగ్ ఇచ్చి గేన్తులేసింది.

శివజ్యోతి 'దీప' రాగం..

ఒక దీపాన్ని వెలిగించి దానిని ఆరిపోకుండా కాపాడాలని మహేష్ కి బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. దానిని నెరవేర్చే క్రమంలో శివజ్యోతి సలహాతో దీపానికి అత్తముక్కలు అడ్డు పెట్టడానికి ప్రయత్నించాడు మహేష్. ఆ ప్రయత్నాన్ని చూస్తూ నవ్వుతున్నారు వరుణ్, వితిక, పునర్నవి.. ఈలోపు బిగ్ బాస్ చేతులతోనే ప్రయత్నం చేయాలని చెప్పాడు. దీంతో వరుణ్ అండ్ బ్యాచ్ చప్పట్లు కొడుతూ గట్టిగా నవ్వారు. ఈ నవ్వులకి శివజ్యోతి ఏడుపు రాగం అందుకుంది. ముందే చెప్పొచ్చుకదా అలా చేయొద్దని.. నేను సలహా ఇస్తున్నప్పుడు చూసి.. బిగ్ బాస్ అలా అనగానే నన్ను హేళన చేస్తున్నారంటూ ఏడుపు లంకించుకుంది. దీంతో వరుణ్ సారీ చెప్పాడు. నేను సారీ చెప్పమన్నానా అంటూ మళ్ళీ ఏడుపు అందుకుంది శివజ్యోతి.

వితిక కాసుల వేట..

వాటర్ సమస్య తీరాలంటే వితిక ఓ పని చేయాలంటూ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఒక చేపల తొట్టెలో కొన్ని కాయిన్స్ వేసి వాటిని తీయాలని చెప్పారు. కనీసం 50 కాయిన్లు తీయాలని షరతు పెట్టారు. మొత్తమ్మీద కాసుల వేట పూర్తి చేసింది వితిక.

జైలులో ఓదార్పు యాత్ర!

ఇక బిగ్ బాస్ అందర్నీ ఒక ఇద్దరు చెత్త పెర్ఫార్మర్స్ ని సెలక్ట్ చేయమని కోరాడు. దానికి హౌస్ మేట్స్ ఎవరూ రెస్పాండ్ కాలేదు. దాంతో బిగ్ బాస్ కచ్చితంగా ఇద్దరు చెత్త పెర్ఫార్మెన్స్ సెలక్ట్ చేసి చెప్పాల్సిందే అని తేల్చి చెప్పాడు. ఇక తప్పనిసరి పరిస్థితిలో వరుణ్, తమన్నా తమకు తామే చెత్త పెర్ఫర్మర్స్ అని ప్రకటించుకున్నారు. బిగ్ బాస్ వారిద్దరినీ జైలులో ఉండాలని కోరాడు. అలా జైల్లోకి వెళ్ళిన తమన్నా కొద్ది సేపట్లోనే ఏడుపు మొదలెట్టింది. హౌస్ మేట్స్ అందరూ ఎందుకని చూస్తే.. తనకు ఏసీ లేకపోతె నిద్ర పట్టాదు అంటూ మరింత ఏడ్చింది. ఇక శ్రీముఖి ఆధ్వర్యంలో తమన్నాను ఓదార్చే కార్యక్రమంలో పడ్డారు హౌస్ మేట్స్.

ఎలావుందంటే..

ముందే చెప్పినట్టు ఇప్పటివరకూ వచ్చిన అన్ని ఎపిసోడ్స్ కంటే ఈ ఎపిసోడ్ మంచి వినోదాన్ని పంచింది. టాస్క్ లు వెంటవెంటనే ఇవ్వడం.. టాస్క్ ల నేపధ్యంలో పుట్టిన ఫన్.. కొంతమంది అకారణ దుఃఖం. కొందరి టాప్ లేచిపోయే ఆనందం.. ఇలా రకరకాలుగా ఎపిసోడ్ బావుందనిపించింది. ఇక జైలు టాస్క్ ఎంతవరకూ కంటిన్యూ అవుతుందో వేచి చూడాలి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories