ఈసారి బిగ్ బాస్ ఎలిమినేషన్ నుంచి ఆమె తప్పించుకోలేదా?

ఈసారి బిగ్ బాస్ ఎలిమినేషన్ నుంచి ఆమె తప్పించుకోలేదా?
x
Highlights

బిగ్ బాస్ ఆసక్తికరంగా ఐదోవారం ఎలిమినేషన్స్ జరగనున్నాయి. మొత్తం ఏడుగురు సభ్యులు ఎలిమినేషన్ కి నామినేట్ కాగా, వారిలో ఇద్దరు శనివారం సేఫ్ జోన్ లో ఉన్నట్టు ప్రకటించారు. ఇక మిగిలిన ఐదు గురిలో ఒకరు ఈరోజు ఎలిమినేట్ అవుతారు. కొద్దిగంటల్లో ఎవరనేది తేలనుంది.

బిగ్ బాస్ 3 ఐదో వారాన్ని ముగించుకొని ఆరోవారంలోకి అడుగుపెట్టనుంది . ఈ నేపధ్యంలో ఈరోజు ఎలిమినేషన్ ప్రక్రియ జరగనుంది . ఈసారి నామినేషన్లలో ఏడుగురు సభ్యులు నామినేట్ అయ్యారు. వారిలో శివజ్యోతి, మహేష్ విట్టా సేఫ్ జోన్ లో ఉన్నట్టు శనివారం నాగార్జున ప్రకటించారు. ఇక ప్రస్తుతం నామినేషన్లలో రాహుల్, హిమాజా, అశు రెడ్డి, పునార్నవి, బాబా భాస్కర్ మిగిలారు. . అయితే ఇందులో నుండి అషు రెడ్డి ఎలిమినేషన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది . గతంలోనూ ఆమె ఎలిమినేషన్ లో ఉన్నప్పటికీ ఆమెకి హీరో పవన్ కళ్యాణ్ ఫాన్స్ మద్దతు ఉండడంతో ఆమె ఎలిమినేషన్ నుండి ఎస్కేప్ అయ్యిందనే ప్రచారం జరిగింది.

హౌస్ మేట్స్ అందరిలోనూ సైలెంట్ గా ఉండే సభ్యురాలు ఆమె ఒక్కరే. పలు దఫాలు ఆమెకు అవకాశం వచ్చినా గేమ్ ఆడటంలో ఆమె తన పంథా మార్చుకోలేకపోవదమూ ఆమె ఎలినినేషన్ తప్పదనే వాదనకు బలం చేకూరుస్తోంది. అదే విధంగా ఈ ఉదయం నుంచీ విస్తృతంగా ప్రచారం అవుతున్నదానిని బట్టి అషు రెడ్డికి ఓటింగ్ తక్కువగా ఉందని చెప్పుకుంటున్నారు. దీంతో అషు రెడ్డి ఎలిమినేషన్ దాదాపు ఖాయం అయినట్టే. ఏవిధమైన మార్పులు లేకపోతె.. అషు రెడ్డికి ఈరోజు బిగ్ బాస్ లో చివరిరోజు కానుందని సమాచారం. ఇక ఏం జరుగుతుంది అనేది తెలియాలంటే మరి కొన్ని గంటలు వేచి చూడక తప్పదు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories