Swathi chinukulu serial actor Bharatwaj tests positive: 'స్వాతి చినుకులు' ఫేం భరద్వాజ్‌కు కరోనా పాజిటివ్!

Swathi chinukulu serial actor Bharatwaj tests positive: స్వాతి చినుకులు ఫేం భరద్వాజ్‌కు కరోనా పాజిటివ్!
x
actor barathwaj
Highlights

Swathi chinukulu serial actor Bharatwaj tests positive: కరోనా వైరస్ విజృంభణ తెలంగాణలో కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా తీవ్రంగా నష్టపోయిన రంగాల్లో టీవీ పరిశ్రమ ముందు వరుసలో ఉంటుంది.

Swathi chinukulu serial actor Bharatwaj tests positive: కరోనా వైరస్ విజృంభణ తెలంగాణలో కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా తీవ్రంగా నష్టపోయిన రంగాల్లో టీవీ పరిశ్రమ ముందు వరుసలో ఉంటుంది. లాక్‌డౌన్‌ కారణంగా గత మూడు నెలలుగా సీరియళ్ళు నిలిచిపోయాయి. ఇక ప్రభుత్వం అనుమతితో జూన్ 1 నుంచి టీవీ షూటింగులకు మళ్లీ పునః ప్రారంభించారు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికి కరోనా మహమ్మారి మాత్రం వదలడం లేదు. ఇప్పటికే 'ఆమె కథ' సీరియల్‌ హీరోయిన్‌ నవ్య స్వామి, బిగ్‌బాస్‌-3తో పాపులర్‌ అయిన రవికృష్ణ, మరో బుల్లితెర నటుడు ప్రభాకర్ మొదలగు వారికి కరోనా సోకిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఈ జాబితాలోకి మరో బుల్లితెర నటుడు భరద్వాజ్ రంగావిజ్జుల కూడా చేరిపోయాడు. గత కొద్దిరోజుల నుంచి ఆయనకి కరోనా లక్షణాలు కనిపించడంతో కరోనా టెస్టులు నిర్వహించుకున్నారు. అందులో ఆయనకి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్నీ భరద్వాజ్ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ వీడియోలో వెల్లడించారు. ఈ వీడియోలో భరద్వాజ్ మాట్లాడుతూ " సరైన ఆహార నియమాలు, మందులతో కరోనా నుంచి బయట పడవచ్చని చెప్పుకొచ్చాడు. ఇక తనతో కలిసి నటించిన వారు టెస్టులు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశాడు" ఇక భరద్వాజ్ స్వాతిచినుకులు, బంధం అనే టీవీ సీరియళ్ల ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.

ఇక అటు తెలంగాణలో కరోనా కేసుల విషయానికి వచ్చేసరికి ఆదివారం నాటికి ఉన్న సమాచారం మేరకు కొత్తగా రాష్ట్రంలో 1,269 కరొనా పాజిటివ్ కేసులు వచ్చాయి. దాంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 34,671 కు చేరుకుంది. ఇక కొవిడ్-19 కారణంగా రాష్ట్రంలో మరో 8 మంది మరణించారు. దాంతో మరణాల సంఖ్య 356 కు చేరింది. గురువారం నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 800 కేసులు వచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 11,833 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది

అటు కరోనా కట్టడికి ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. అందులో భాగంగా టెస్టింగ్ సామర్ధ్యాన్ని జిహెచ్ఎంసీ తోపాటుగా మరికొన్ని జిల్లాల్లో భారీగా పెంచింది. ఇక కరోనాని మరింతగా కట్టడికి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కంటైన్మేంట్ జోన్లలో ఈ నెల చివరి వరకు లాక్ డౌన్ ని పొడిగించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories