Coronavirus Pandemic in Bollywood: బాలీవుడ్ ఇండస్ట్రీపై కరోనా పంజా

Arun Chilukuri
Published on: 13 July 2020 3:26 PM IST
Coronavirus Pandemic in Bollywood: బాలీవుడ్ ఇండస్ట్రీపై కరోనా పంజా
X

Coronavirus Pandemic in Bollywood: బాలీవుడ్ ఇండస్ట్రీని కరోనా షేక్ చేస్తోంది. సినీ సెలబ్రెటీలను వారి ఫ్యామిలీ మెంబర్స్ ని , వర్కర్స్ ని వైరస్ వేధిస్తోంది. లాక్ డౌన్ అమలు నుంచి సెలబ్రెటీలంతా ఇంటికే పరిమితమయ్యారు. షూటింగ్ లను సైతం ఆపేశారు. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. ఈ టైంలో పలువురు స్టార్లకు కరోనా అని తేలడంతో బాలీవుడ్ లో అందోళన మొదలైంది. ప్రస్తుతం వారంతా హస్పిటల్స్ లో చికిత్స తీసుకుంటున్నారు.

ముంబైలో కరోనా విలయతాండవం చేస్తోంది. కరోనా సెగ ఇప్పుడు బాలీవుడ్ ను తాకింది. ఇప్పటికే పలువురు స్టార్స్ కరోనా బారిన పడి కోలుకున్నారు . తాజాగా బాలీవుడ్ స్టార్ అమితాబ్ ఫ్యామిలీని కరోనా కలవరపెడుతోంది. అమితాబ్, అభిషేక్ నానావ‌తి ఆసుప‌త్రిలో చికిత్స పొందుతుండ‌గా, ఐష్‌, ఆరాధ్యల‌కి ఇంట్లోనే చికిత్సనందిస్తున్నారు.

బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ నటి రేఖ బంగ్లాలోని సెక్యూరిటీ గార్డ్ కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ముంబైలోని బాంద్రాలోని బ్యాండ్‌స్టాండ్ ప్రాంతంలో ఆమె ఉంటున్న బంగ్లాకి బీఎంసీ అధికారులు కంటైన్‌మెంట్ జోన్‌గా నోటీసు అంటించారు. మరోవైపు మిగతా సిబ్బందికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం రేఖ హోం క్వారంటైన్ లో ఉన్నారు.

బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఫ్యామిలీ కూడా కరోనా బారిన పడింది. తల్లి దులారి, ఆయన సోదరుడు, వదిన మేనకోడలకు కూడా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. అయితే అనుపమ్ ఖేర్ టెస్ట్ చేసుకోగా నెగిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. ఈ విషయాన్నీ అనుపమ్ ఖేర్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన తల్లి ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ తో పాటు నీతూ కపూర్‌ కూడా కరోనా సోకినట్లు వార్తలు వచ్చాయి. కానీ డిజైనర్ రిదిమా కపూర్ ఇదంతా రూమర్ అని కొట్టిపారేసింది. విపత్కర సమయంలోనైనా దయచేసి పుకార్లు పుట్టించకండి అంటూ రిక్వెస్ట్ చేసింది. అయితే రిదిమా ఇచ్చిన ఓ బర్త్ డే పార్టీకి అమితాబ్‌ బచ్చన్ మనవడు అగస్త్య నంద హాజరయ్యారు. అందుకే ఈ పుకార్లు వచ్చినట్లు తెలుస్తోంది.

బాలీవుడ్ స్టార్స్ ని కరోనా భయం వెంటాడుతుండంతో సినీ అభిమానుల ఆందోళన చెందుతున్నారు. వారి అభిమాన హీరోలు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story