Sushant sing rajput last movie Dil Bechara Trailer : డైలాగ్స్ తో ఎడిపించావ్ సుశాంత్!

Sushant sing rajput last movie Dil Bechara Trailer : బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చివరగా నటించిన చిత్రం 'దిల్‌ బేచారా'.. ఈ రోజు సినిమాకి సంబంధించిన చిత్ర ట్రైలర్ ని విడుదల చేశారు

Krishna
Updated on: 6 July 2020 8:45 PM IST
Sushant sing rajput last movie Dil Bechara Trailer : డైలాగ్స్ తో ఎడిపించావ్ సుశాంత్!
X

sushant sing rajput last movie Dil Bechara Trailer : బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చివరగా నటించిన చిత్రం 'దిల్‌ బేచారా'.. ఈ రోజు సినిమాకి సంబంధించిన చిత్ర ట్రైలర్ ని విడుదల చేశారు మేకర్స్.. రెండు నిమిషాల నలబై మూడు నిముషాలు ఉన్న ఈ సినిమా ట్రైలర్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సుశాంత్ చెప్పే ఒక్కో డైలాగ్ ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. 'ఎలా పుట్టాలి ఎప్పుడు చావాలి అన్నది మనం డిసైడ్ చేయలేం.. కానీ ఎలా బతకాలన్నది మాత్రం మన చేతుల్లో ఉంది" అంటూ సుశాంత్ చెప్పిన ఈ డైలాగ్ కి ప్రతి ఒక్కరు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు..

ఈ సినిమాలో సుశాంత్ సరసన సంజనా సంఘి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో హీరోయిన్ కి క్యాన్సర్ ఉండడం.. ఆ తర్వాత ఆమెకి హీరో పరిచయం అవ్వడం, ప్రేమలో పడడం, ఆమెకి త్వరలో చనిపోతుందని తెలుసుకున్న హీరో ఆమె కోరికలన్నీ తీరుస్తాడు. ఈ సినిమాకి ముఖేశ్ చాబ్రా తొలిసారిగా దర్శకత్వం వహించారు.. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. ఈ సినిమాని వచ్చే నెల 24న డిస్నీ ప్లస్ హాట్ స్టార్(Disney Plus Hotstar) లో విడుదల చేయనున్నారు మేకర్స్ .హాలీవుడ్ లో వచ్చిన 'ద ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్'కు ఈ సినిమా రీమేక్ గా ఈ సినిమాని తెరకెక్కించారు. సుశాంత్ చివరి చిత్రం కావడంతో అభిమానులకి ఫ్రీగా చూసే అవకాశం కల్పిస్తున్నారు.

ఇక సుశాంత్ సింగ్ రాజ్ పుత్ స్టార్ ప్లస్ లో ప్రసారం అయిన ఓ సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయం అయ్యాడు.. అక్కడి నుంచి తన కెరీర్ ని మొదలుపెట్టిన సుశాంత్ మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు.. ఇక సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి మరింతగా పాపులర్ అయ్యాడు.. శుద్ధ్ దేశీ రొమాన్స్, ఎంఎస్ ధోని, కేదారనాథ్, చిచ్చోరె సినిమాల్లో నటించి మెప్పించారు. కెరీర్ మంచి ఊపు మీద ఉన్న సమయంలో సుశాంత్ అందరినీ షాక్ కి గురి చేస్తూ ఆత్మహత్య చేసుకొని తిరిగిరాని లోకాలకు వెళ్లపోయాడు.


Krishna

Krishna

Next Story