Sonu Sood Arrange Another Special Flight: సోనూసూద్ 'ఫేజ్-2' ప్రత్యెక విమానం 14 న బయలుదేరుతోంది!

Sonu Sood Arrange Another Special Flight: వలస కూలీలను స్వంత ప్రాంతాలకు పంపించడమే తన పనిగా పెట్టుకుని.. దీక్షలా ఆ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు సినీ నటుడు సోనూసూద్.

K V D Varma
Updated on: 14 Aug 2020 10:40 PM IST
Sonu Sood Arrange Another Special Flight:  సోనూసూద్ ఫేజ్-2 ప్రత్యెక విమానం 14 న బయలుదేరుతోంది!
X
Sonu Sood

Sonu Sood Arrange Another Special Flight: వలస కూలీలను స్వంత ప్రాంతాలకు పంపించడమే తన పనిగా పెట్టుకుని.. దీక్షలా ఆ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు సినీ నటుడు సోనూసూద్. ఈ క్రమంలో విదేశాల్లో చిక్కుకున్న వారిని స్వదేశానికి ప్రత్యెక విమానంలో చేరుస్తున్నారు. కొన్నిరోజుల క్రితం మనీలా నుంచి విమానంలో వలస కార్మికులను తరలించిన సోనూ ఇప్పుడు మరో విమానం అక్కడి నుంచి బయలుదేరబోతందంటూ ప్రకటించారు.

ఇది ఫేజ్-2 అంటూ ట్వీట్ చేసిన సోనూసూద్ ''భారత్‌-పిలిప్పీన్స్‌.. మీ కుటుంబాలను కలుసుకునేందుకు మీరంతా సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను. మనీలా నుంచి ఢిల్లీకి ఆగస్టు 14న సాయంత్రం 7.10 గంటలకు ఎస్జీ9286 అనే విమానం బయల్దేరబోతోంది. మిమ్మల్ని ఆ విమానంలో ఎక్కించుకుని సొంతగడ్డకు చేర్చాలని ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను'' అంటూ అయన తన ట్విట్టర్ లో పేర్కొన్నారు.

అంతేగాక కజకస్థాన్‌లో చిక్కుకున్న మన తెలుగు వారి కోసం కూడా మరోక ప్రత్యేక విమానం ఏర్పాటు చేసినట్లు సోనూ సూద్‌ మరో ట్వీట్‌లో‌ తెలిపారు. ఇది ఆగస్టు 14న కజక‌స్థాన్‌ బయల్దేరడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సోనూ సూద్‌ వెల్లడించారు.




K V D Varma

K V D Varma

Next Story