Sonu Sood About His Tollywood Next Films: టాలీవుడ్ నా ఇల్లు.. ఇండస్ట్రీని ఆకాశానికి ఎత్తేసిన సోనూసూద్!

Sonu Sood About His Tollywood Next Films: కరోనా లాంటి కష్ట సమయంలో వలస కూలీల పాలిట దేవుడు అయ్యాడు బాలీవుడ్ నటుడు సోనూసూద్.. కష్టం అనే మాట వినిపిస్తే చాలు
Sonu Sood About His Tollywood Next Films : కరోనా లాంటి కష్ట సమయంలో వలస కూలీల పాలిట దేవుడు అయ్యాడు బాలీవుడ్ నటుడు సోనూసూద్.. కష్టం అనే మాట వినిపిస్తే చాలు అక్కడ నేను ఉన్నాను అంటూ వాలిపోతున్నాడు. ఇప్పటికి చాలా మందికి సహాయం చేసి అందరి దృష్టిలో దేవుడయ్యాడు సోనూసూద్.. ఇప్పుడు అందరికి సినిమాలో కనిపించే విలన్ సోనూసూద్ కాదు.. అతనో హీరో..
అలాంటి సోనూసూద్ తాజాగా HMTVకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో పలు అంశాలను పంచుకున్నారు అయన.. ఇక టాలీవుడ్ గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలని వెల్లడించారు. టాలీవుడ్ ఇండస్ట్రీ తనకి ఇల్లు లాంటిదని అన్నాడు. తెలుగు సినిమాల్లో నటించేందుకు తానూ ఎంతగానో ఇష్టపడుతాను అని చెప్పుకొచ్చాడు. ఇక దర్శకుడు త్రివిక్రమ్, పూరి, కందిరీగ శ్రీనుతో మంచి ఫ్రెండ్ షిప్ ఉన్నట్టుగా వెల్లడించాడు. ఇక ప్రభాస్, బన్నీ, ఎన్టీఆర్ లతో సినిమాలు చేశానని వారు మంచి జేన్యున్ పర్సన్స్ అంటూ చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం కందిరీగ 2 సినిమాలో నటిస్తున్నాని వెల్లడించాడు. షూటింగ్ చివరి దశకి చేరుకుందని స్పష్టం చేశాడు. అలాగే చిరంజీవి, కొరటాల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్టుగా వెల్లడించాడు. ఇక కరోనా వలన నష్టపోయిన సినిమా ఇండస్ట్రీ త్వరలొనే కోలుకుంటుందని ఆశిస్తున్నట్టుగా వెల్లడించాడు సోనూసూద్..
ఇక సోనూసూద్ సినిమాల విషయానికి వచ్చేసరికి సూపర్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన సోనూసూద్ స్టైలిష్ విలన్ గా టాలీవుడ్ లో పేరు సంపాదించుకున్నాడు. ఇక కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అరుంధతి చిత్రంలో పసుపతిగా నటించి ఉత్తమ విలన్ గా నంది అవార్డు అందుకున్నాడు. ఆ తరువాత జులాయి, దూకుడు, ఆగడు, కందిరీగ మొదలైన సినిమాల్లో నటించి మంచి విలన్ గా స్థిరపడిపోయారు.
ఆదిలాబాద్ జిల్లాలో జలపాతాలు కళకళ
26 Jun 2022 5:03 AM GMTబీహార్‌కు చెందిన డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఇంట్లో డబ్బే డబ్బు
26 Jun 2022 3:30 AM GMTతెలంగాణ విద్యాశాఖ సంచలన నిర్ణయం.. టీచర్లు ఏటా ఆస్తుల వివరాలు చెప్పాల్సిందే..
25 Jun 2022 10:50 AM GMTపెళ్లి కాలేదని నమ్మించి రెండో పెళ్లి.. మొదటి భార్య పాత్ర..
25 Jun 2022 9:49 AM GMTతండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
25 Jun 2022 7:28 AM GMTప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి
25 Jun 2022 5:43 AM GMTCM Jagan: సీఎం అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం
24 Jun 2022 6:43 AM GMT
Revanth Reddy: అగ్నిపథ్‌ను వెనుక్కి తీసుకునేదాకా కాంగ్రెస్ పోరాటం...
26 Jun 2022 1:54 PM GMTEmployees: ఉద్యోగులకి అలర్ట్.. ఈ పథకం కింద 7 లక్షల ప్రయోజనం..!
26 Jun 2022 1:30 PM GMTBank Holidays: ఖాతాదారులకి అలర్ట్.. జూలైలో 14 రోజులు బ్యాంకులు...
26 Jun 2022 12:30 PM GMTBandi Sanjay: మోడీ సభతో సరికొత్త చరిత్ర సృష్టిస్తాం..
26 Jun 2022 12:15 PM GMTరాష్ట్రపతి పాలన దిశగా మహారాష్ట్ర రాజకీయాలు
26 Jun 2022 11:51 AM GMT