డిసెంబర్ లో శింబు, త్రిష పెళ్లి?

Simbu and Trisha Wedding : కోలీవుడ్ చిత్రపరిశ్రమలో బెస్ట్ జోడిగా శింబు, త్రిషకి మంచి పేరుంది. విన్నైతాండి వరువాయ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించింది ఈ జోడి..

Krishna
Published on: 16 Oct 2020 1:23 PM IST
డిసెంబర్ లో శింబు, త్రిష పెళ్లి?
X

Simbu and Trisha Wedding : కోలీవుడ్ చిత్రపరిశ్రమలో బెస్ట్ జోడిగా శింబు, త్రిషకి మంచి పేరుంది. విన్నైతాండి వరువాయ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించింది ఈ జోడి.. గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ పండింది. ఇది చూసిన ప్రేక్షకులు వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అనుకున్నారు. అంతేకాకుండా వీరి పెళ్ళి పైన ఇప్పటికే లెక్కలేనన్ని సార్లు వార్తలు కూడా వచ్చాయి కూడా.. అయితే తాము కేవలం స్నేహితులం మాత్రమే అంటూ చెప్పుకొస్తున్నారు శింబు, త్రిష

అయినప్పటికీ వీరి పెళ్లి వార్తలకి బ్రేక్ పడడం లేదు.. ఇక లాక్ డౌన్ సమయంలో వీరిద్దరూ కలిసి ఓ షార్ట్ ఫిలిం కోసం పనిచేసారు. అయితే ఈ ఏడాది డిసెంబర్‌లో ఓ శుభవార్త చెబుతానంటూ ఇటీవల శింబు కూడా ప్రకటించాడు. వీరు రిలేషన్ లో ఉండడంతో వీరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ మరోసారి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇదే విషయం పైన తాజాగా తమిళ నిర్మాతల మండలి ఎన్నికల్లో పోటి చేసేందుకు వచ్చిన శింబు తండ్రి రాజేందర్‌‌‌ ను ఓ విలేకరి అడగగా ఆయన సమాధానం ఇవ్వకుండా వెళ్ళిపోయారు.

ఇక ఇప్పటికే శింబు హీరోయిన్స్ నయనతార, హన్సికలతో ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే.. ఈ తరుణంలో మళ్ళీ త్రిషతో ప్రేమ, పెళ్లి అంటూ వార్తలు రావడంతో ఆసక్తిని సంతరించుకుంది. అటు త్వరలో శింబు, త్రిష కలిసి విన్నైతాండి వరువాయ సీక్వెల్‌లో నటిస్తున్నట్టుగా సమాచారం..

Krishna

Krishna

Next Story