Trisha Marriage: కాంట్రవర్షల్ హీరోతో త్రిష పెళ్లి?

Trisha Marriage : త్రిష కృష్ణన్ .. ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్ళు అయింది. 1999 లో విడుదలైన ప్రశాంత్ జోడిలో బ్లింక్-అండ్-మిస్ పాత్రలో ఆమె తొలిసారిగా వెండితెర పై కనిపించింది.

Krishna
Published on: 19 July 2020 7:15 PM IST
Trisha Marriage: కాంట్రవర్షల్ హీరోతో త్రిష పెళ్లి?
X
Trisha (file photo)

Trisha Marriage : త్రిష కృష్ణన్ .. ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్ళు అయింది. 1999 లో విడుదలైన ప్రశాంత్ జోడిలో బ్లింక్-అండ్-మిస్ పాత్రలో ఆమె తొలిసారిగా వెండితెర పై కనిపించింది. ఆ తర్వాత వివిధ భాషల్లో స్టార్ హీరోలందరితో వర్క్ చేసి టాప్ హీరోయిన్ గా కొనసాగింది. అయితే ఇప్పటివరకూ త్రిష ఇంకా పెళ్లి చేసుకోలేదు.. అప్పట్లో సినీ నిర్మాత వరుణ్‌ మణియన్‌తో నిశ్చితార్ధం అయి వివిధ కారణాలతో అది క్యాన్సల్ అయిన సంగతి తెలిసిందే.. ఆ తర్వాత మళ్ళీ సినిమాలు చేసుకుంటూ పాయిన త్రిష త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుందని తెలుస్తోంది. అయితే త్రిష పెళ్లి చేసుకునేది ఎవరినో కాదట! తమిళ్ హీరో శింబునే అంటూ కోలివుడ్ వర్గాలు అంటున్నాయి.

ఇటీవల వీరిద్దరి మధ్య ప్రేమ కలిగిందని, వీరి ప్రేమకి ఇరువురు కుటుంబ సభ్యులు కూడా ఒకే చెప్పడంతో శింబు, త్రిష త్వరలోనే వివాహం చేసుకునేందుకు రెడీగా ఉన్నారని తెలుస్తోంది. కరోనా నుంచి పరిస్థతులు మెరుగు పడ్డాక ఇద్దరి పెళ్లి జరగనుందని టాక్.. అయితే ఇందులో నిజం ఎంతుందో తెలియదు. ఇక ఈ వార్తల పై అటు శింబు కానీ, ఇటు త్రిష కానీ ఇంతవరకూ స్పందించలేదు..ఇక త్రిష, శింబు కలిసి విన్నైతాండి వరువాయ(ఏమాయ చేశామే తమిళ్‌ వెర్షన్‌), అలై మొదలగు చిత్రాలలో కలిసి నటించారు!

ఇక ఇప్పటికే శింబు హీరోయిన్స్ నయనతార, హన్సికలతో ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే.. ఈ తరుణంలో మళ్ళీ త్రిషతో ప్రేమ, పెళ్లి అంటూ వార్తలు రావడంతో ఆసక్తిని సంతరించుకుంది. త్వరలో శింబు, త్రిష కలిసి విన్నైతాండి వరువాయ సీక్వెల్‌లో నటిస్తున్నట్టుగా సమాచారం..


Krishna

Krishna

Next Story