డ్రగ్స్ కేసు : రకుల్ అరెస్ట్ తప్పదా?

డ్రగ్స్ కేసు : రకుల్ అరెస్ట్ తప్పదా?
x

Rakul Preet Singh

Highlights

Rakul Preet Singh : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ అనుమానాస్పద మృతి కేసులో భాగంగా డ్రగ్స్ కోణం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.. దీనిపైన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి ) విచారణ చెప్పట్టింది..

Rakul Preet Singh : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ అనుమానాస్పద మృతి కేసులో భాగంగా డ్రగ్స్ కోణం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.. దీనిపైన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి ) విచారణ చెప్పట్టింది.. అయితే ఈ కేసులో ముందు నుంచి కీలక సూత్రధారిగా ఉన్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రియురాలు రియా చక్రవర్తిని ఎన్‌సిబి అధికారులు సెప్టెంబర్ 9 న అరెస్ట్ చేశారు. అరెస్ట్ కి ముందు రియాని వరుసగా నాలుగు రోజులు విచారణ చేశారు. ఈ విచారణలో రియా చిత్ర పరిశ్రమకు చెందిన 25 మంది సెలబ్రిటీల పేర్లను రియా చెప్పినట్టుగా ఎన్‌సిబి కూడా అధికారికంగా పలువురు పేర్లను వెల్లడించింది.

అందులో భాగంగానే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ని నిన్న ( శుక్రవారం ) విచారించింది. రకుల్ ని ఎన్‌సిబి అధికారులు సుమారుగా నాలుగు గంటలు పాటు విచారణ చేశారు. అయితే ఈ విచారణలో రకుల్ తానూ డ్రగ్స్ చాట్ మాత్రమే చేశానని, డ్రగ్స్ తీసుకోలేదని వెల్లడించిందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అంతేకాకుండా రియా కోరిన మేరకు తన ఫ్లాట్‌లో డ్రగ్స్ దాచినట్టుగా రకుల్ అంగీకరించిందని సమాచారం.. ఒకవేళ రకుల్ దీనిని అంగీకరించినట్టైతే ఆమె అరెస్ట్ తప్పదని ప్రముఖ సీనియర్ న్యాయవాది రిజ్వాన్ మర్చంట్‌ అన్నారు. ఎన్‌డిపిఎస్ చట్టంలోని సెక్షన్ 8 (సి) ప్రకారం డ్రగ్స్‌ను దాచడం పెద్ద నేరమని ఆయన పేర్కొన్నారు.

రకుల్ విచారణ అనంతరం ఎన్‌సీబీ డైరెక్టర్‌ జనరల్‌ అశోక్‌ జైన్‌ మాట్లాడుతూ.. " 'సిట్‌ రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసింది. దాన్ని విశ్లేషించి, నివేదికను కోర్టుకు సమర్పించనున్నాం' అని వెల్లడించారు. విచారణలో రకుల్‌ కూడా మరో నలుగురు సెలబ్రిటీల పేర్లు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక అటు రకుల్ ప్రీత్ సింగ్ కి రియా చక్రవర్తికి మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. ముంబై వెళ్లినప్పుడల్లా రియాతోనే రకుల్ కలిసి తిరిగేదని ఆమెతో కలిసి పార్టీలకు, పబ్బులకు వెళ్లేదని తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories