Top
logo

ఎన్‌సీబీ విచార‌ణ‌కు హాజ‌రైన సారా, శ్రద్ధాక‌పూర్.. దీపిక ఫోన్ సీజ్!

ఎన్‌సీబీ విచార‌ణ‌కు హాజ‌రైన సారా, శ్రద్ధాక‌పూర్.. దీపిక ఫోన్ సీజ్!
X

Shraddha Kapoor 

Highlights

NCB Office : డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదురుకుంటున్న బాలీవుడ్ హీరోయిన్లు సారా అలీ ఖాన్, శ్రద్ధాక‌పూర్ లు కొద్దిసేపటి క్రితమే నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) విచారణకు హాజరయ్యారు. విచారణకి హాజరు కావాలని ఎన్‌సీబీ వీరికి బుధవారం సమన్లు జారీ చేసింది.

NCB Office : డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదురుకుంటున్న బాలీవుడ్ హీరోయిన్లు సారా అలీ ఖాన్, శ్రద్ధాక‌పూర్ లు కొద్దిసేపటి క్రితమే నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) విచారణకు హాజరయ్యారు. విచారణకి హాజరు కావాలని ఎన్‌సీబీ వీరికి బుధవారం సమన్లు జారీ చేసింది. ఇక ఈ రోజు ఉదయం 9.45 గంటలకు తన మేనేజర్ కరిష్మా ప్రకాశ్‌తో కలిసి దీపికా పదుకునే ముంబైలోని ఎన్‌సీబీ కార్యాలయానికి హాజరైంది.గోవాలో ఉన్న దీపికా పదుకొనే తన భర్త రణ్‌వీర్ సింగ్‌తో కలిసి గురువారం ముంబై చేరుకున్నారు. విచారణలో భాగంగా ఆమె ఫోన్‌ను అధికారులు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ముంబైలోని కొలాబాలోని ఎవెలిన్ గెస్ట్ హౌస్‌ లో ప్రస్తుతం విచారణ సాగుతుంది. ఇందులో డ్రగ్స్ కోణం పైన ఎన్‌సీబీ అధికారులు పలు కోణాల్లో దర్యాప్తు చేయనున్నారు.అటు శుక్రవారం రకుల్ ప్రీత్ సింగ్ ని ఎన్‌సిబి అధికారులు సుమారుగా నాలుగు గంటల పాటు విచారణ చేశారు. ఈ విచారణలో రకుల్ తానూ డ్రగ్స్ చాట్ మాత్రమే చేశానని, డ్రగ్స్ తీసుకోలేదని వెల్లడించింది. దీనిపైన ఎన్‌సీబీ డైరెక్టర్‌ జనరల్‌ అశోక్‌ జైన్‌ మాట్లాడుతూ.. " 'సిట్‌ రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసింది. దాన్ని విశ్లేషించి, నివేదికను కోర్టుకు సమర్పించనున్నాం' అని వెల్లడించారు. రకుల్‌ కూడా మరో నలుగురు సెలబ్రిటీల పేర్లు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.


Web TitleShraddha Kapoor and sara ali khan arrives at NCB office for NCB interrogation on bollywood drug case
Next Story